Kichha Sudeep's Action Thriller 'Max' OTT Release On 15th February In ZEE5: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kichha Sudeep) రీసెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మ్యాక్స్' (Max). మాస్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్ అయిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌ను ZEE5 తాజాగా ప్రకటించింది. ఈ మూవీ ఫిబ్రవరి 15న (శనివారం) రాత్రి 7:30 గంటలకు జీ5లో స్ట్రీమింగ్ కానుంది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. విజయ్ కార్తికేయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను కలైపులి ఎస్.థాను నిర్మించారు. పాన్ ఇండియా రేంజ్‌లో 'మ్యాక్స్' మూవీ గతేడాది డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళంలోనూ మంచి టాక్ వచ్చింది. కిచ్చా సుదీప్ మాస్ అవతార్‌లో చాలా కొత్తగా కనిపించారు. ఆయనతో పాటు వరలక్ష్మి శరత్‌కుమార్, సంయుక్త హోర్నాడ్, సుకృతా వాగ్లే, సునీల్, అనిరుధ్ భట్ వంటి వారు నటించి మెప్పించారు. కలైపులి ఎస్.థాను (వి క్రియేషన్స్), కిచ్చా సుదీప (కిచ్చా క్రియేషన్స్) నిర్మించిన ఈ థ్రిల్లింగ్ చిత్రం ఇప్పటికే 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రంగా నిలిచింది.

'ఎంతో సంతోషంగా ఉంది'

పోలీసు ఇన్‌స్పెక్టర్ అర్జున్ మహాక్షయ్ (కిచ్చా సుదీప్)గా 'మ్యాక్స్‌'లో కిచ్చా సుదీప్ అదరగొట్టేశారు. పోలీస్ ఆఫీసర్ పవర్, గ్యాంగ్ స్టర్‌లను పరుగులు పెట్టించే నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కిచ్చా సుదీప్ మెప్పించారు. అల్టిమేట్ మాస్ బ్లాక్‌బస్టర్ అయిన మ్యాక్స్ చిత్రాన్ని ZEE5 ప్రేక్షకులకు అందించడం పట్ల తాము సంతోషంగా ఉన్నామని ZEE5 ప్రతినిధి తెలిపారు. 'మ్యాక్స్ ఒక థ్రిల్లింగ్ యాక్షన్ - ప్యాక్డ్ రైడ్, హై-ఆక్టేన్ డ్రామాగా అందరినీ ఆకట్టుకుంది. గ్రిప్పింగ్ స్టోరీలైన్, కిచ్చా సుదీప్ అద్భుతమైన యాక్టింగ్‌కు జీ5 వీక్షకులు కూడా ఆశ్చర్యపోతారని మేం నమ్ముతున్నాం. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించడంతో.. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళంలోని అభిమానులకు అదే ఆడ్రినలిన్ రష్‌ని నేరుగా మా వీక్షకులకు అందించబోతోన్నాం’ అని అన్నారు.

Also Read: 'స్టోరీనే ఫైనల్.. కథ బాగుంటే బామ్మ రోల్ అయినా ఓకే' - నేషనల్ క్రష్ రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

'ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి చేరువ'

'మ్యాక్స్‌ మూవీ ZEE5లో స్ట్రీమింగ్ అవుతుండండం నాకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా థియేటర్లలో విడుదలైన క్షణం నుంచి అభిమానులు, ఆడియెన్స్‌ను నుంచి ప్రేమ లభిస్తూనే వచ్చింది. పోలీస్ ఇన్‌స్పెక్టర్ అర్జున్ మహాక్షయ్ పాత్రలో నటించడం గొప్ప అనుభవం. యాక్షన్, ఎమోషన్, ఇంటెన్స్ డ్రామాతో నిండిన ఈ మూవీని ఇప్పుడు జీ5లో అందరూ చూడబోతోన్నారు. మాక్స్ డిజిటల్‌గా ప్రీమియర్‌లను ప్రదర్శిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.  ఇక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మరింత ఎక్కువ మందికి చేరుతుందని ఆశిస్తున్నాను’ అని  హీరో కిచ్చా సుదీప్ అన్నారు. కాగా, దర్శక ధీరుడు రాజమౌళి 'ఈగ' సినిమాతో సుదీప్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో విలన్‌గా మెప్పించిన సుదీప్.. ఆ తర్వాత 'బాహుబలి' సినిమాలోనూ నటించి మెప్పించారు. తాజాగా 'మ్యాక్స్'తో అలరించారు.

Also Read: 22 ఏళ్ల తర్వాత యాక్టర్‌గా తమన్ - 'ఇదయమ్ మురళి' టైటిల్ టీజర్ వచ్చేసింది, వీడియో ప్రోమో చూశారా?