కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ మీడియాకి, అభిమానులకి క్షమాపణలు చెప్పారు. ఆయన కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా సినిమా 'విక్రాంత్ రోణ'. జులై 28 న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపధ్యంలోనే సినిమా ప్రమోషన్స్ కోసం ప్రెస్ మీట్ షెడ్యూల్ చేశారు. కానీ అవి వాయిదా పడ్డాయి. దీంతో సుదీప్ ట్విటర్ ద్వారా క్షమాపణ చెప్పారు. 'చెన్నై, కొచ్చి, హైదరాబాద్ లోని ప్రెస్ మీట్మీ, ఈవెంట్స్ క్యాన్సిల్ చేసినందుకు మీడియా ఫ్రెండ్స్, అభిమానులకి నా క్షమాపణలు. అనారోగ్య కారణాల వల్ల వారిని రద్దు చేశాను. కోలుకున్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. త్వరలోనే మీటింగ్స్ సంబంధించిన డేట్స్ ప్రకటించి మీ అందరినీ కలుస్తాను' అని రాసుకొచ్చారు. విజయ టీవి లో ప్రసారమయ్యే ఒక రియాలిటీ షో కూడా సుదీప్ ప్రారంబించాల్సి ఉంది. దానికి కూడా హాజరుకాకపోవడంపై క్షమాపణ చెప్పారు. 




Also Read :అంచనాలు ఆకాశాన్ని అందుకునేలా చేసిన పూరి - విజయ్ దేవరకొండ 'లైగర్' ట్రైలర్ వచ్చేసింది



కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'విక్రాంత్ రోణ'. అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ గా విక్రాంత్ రోణను తెరకెక్కించారు. ఈ సినిమాలో సుదీప్ సరసన జాక్వెలిన్ నటించారు. జాక్ మంజునాథ్, శాలిని మంజునాథ్, అలంకార్ పాండియన్ నిర్మించారు. అనూప్ భండారి దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల రెండు సార్లు వాయిదా పడింది. తొలుత గతేడాది ఆగస్ట్ 19 న విడుదల కావాల్సి ఉండగా ఆగిపోయింది. ఆ తర్వాత ఏడాది ఫిబ్రవరి 24 న చెయ్యాలని భావించారు కానీ కుదరలేదు. ఎట్టకేలకి జులై 28 న విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను పెంచేస్తుంది. 




భయం నిండిన ఊరిలో భయమంటే ఏమిటో తెలియని వాడిగా విక్రాంత్ రోణగా సుదీప్ మరోసారి స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఇన్స్పెక్టర్ సురేష్ కృష్ణ హత్యతో పాటు ఆ ఊరిలో జరిగిన మరొకొన్ని హత్యల వెనుక నిజాలను వెలికితీసే అధికారి పాత్రలో సుదీప్ నటించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమైంది. సుదీప్ డ్యూయల్ రోల్ చేసినట్టు ఉన్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో త్రీడీలో సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు.


Also Read : 'పరంపర 2' రివ్యూ: ఫస్ట్ సీజన్ కంటే లెంగ్త్ తక్కువ - జగపతి బాబు, నవీన్ చంద్ర, శరత్ కుమార్ నటించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?