క్రిస్మస్ బరిలో అరడజనుకు పైగా సినిమాలు థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే నాలుగు తెలుగు సినిమాలు ఆ సీజన్ మీద కర్చీఫ్ వేశారు. రెండు డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి మరొక సినిమా వచ్చింది.


తెలుగులో క్రిస్మస్ సందర్భంగా సుదీప్ 'మ్యాక్స్'
Kiccha Sudeep Max Telugu Release Date: కన్నడ సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడు కిచ్చా సుదీప్ నటించిన సినిమా 'మ్యాక్స్'. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. ఇందులో పవర్ ఫుల్ యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్, టాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ కీలక పాత్రల్లో నటించారు. వి క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ సంస్థలపై కలైపులి యస్ థాను ప్రొడ్యూస్ చేశారు. 


'మ్యాక్స్' సినిమాకు విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు. తెలుగులో డిసెంబర్ 25న ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు ఈ రోజు అనౌన్స్ చేశారు.


Also Read: క్రిస్మస్ బరిలో ఫ్లాప్స్ నుంచి బయట పడేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు? - అన్నీ క్రేజీ సినిమాలే






పోలీస్ అధికారిగా కిచ్చా సుదీప్!
Kiccha Sudeep role in Max movie: 'మ్యాక్స్' సినిమాలో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా 'కిచ్చా' సుదీప్ నటించారు. ఆల్రెడీ విడుదలైన టీజర్ (Max Teaser) చూస్తే... ఇందులో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని అర్థం అవుతోంది. తెలుగులో 'ఈగ' నుంచి కిచ్చా సుదీప్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకని, ఈ 'మ్యాక్స్' మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో సంయుక్త హోర్నాడ్, సుకృతి వాగల్, అనిరుధ్ భట్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా వర్క్: శేఖర్ చంద్ర, కూర్పు: ఎస్ఆర్ గణేష్ బాబు, సంగీతం: అజనీష్ లోకనాథ్.


Also Readదేవకీ నందన వాసుదేవ రివ్యూ: మహేష్ బాబు మేనల్లుడు అశోక్ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడానికి కారణాలు ఏంటి?



క్రిస్మస్ బరిలో విడుదలవుతున్న సినిమాలు
Christmas 2024 movie releases Telugu: క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న నితిన్, శ్రీ లీల జంటగా విడుదల కానుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ఫ్లాపుల నుంచి నితిన్ బయట పడతారని యూనిట్ నమ్మకంగా ఉంది. ఈ సినిమాకు ఐదు రోజుల ముందు డిసెంబర్ 20న ప్రియదర్శి 'సారంగపాణి జాతకం', 'అల్లరి' నరేష్ 'బచ్చలమల్లి', తమిళ డబ్బింగ్ సినిమా 'విడుదలై 2' (విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో వెట్రిమారన్ తీసిన సినిమా), సుమన్ బాబు 'ఎర్రచీర' విడుదల కానున్నాయి. డిసెంబర్ 21న గౌతమ్ తిన్ననూరి తీసిన చిన్న సినిమా 'మేజిక్' విడుదల కానుందని సమాచారం.