KGF2 Movie Twitter Review - Audience Reaction KGF2: యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'కెజియఫ్ 2' సినిమాకు సోషల్ మీడియా ఫిదా అంటోంది. ఆల్రెడీ అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇంకా కొన్ని చోట్ల షోలు స్టార్ట్ అయ్యాయి. రాకీ భాయ్ పెర్ఫార్మన్స్‌కు ప్రేక్షకులు సలామ్ కొడుతున్నారు. 'కె.జి.యఫ్ 2'కు (KGF2 Movie Review) నెటిజన్స్ బ్లాక్ బస్టర్ రివ్యూలు ఇస్తున్నారు. సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు దుబాయ్‌లో సెన్సార్ పూర్తయింది. అప్పుడు చూసిన వాళ్ళు సూపర్ హిట్ అన్నారు. ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చారు.


KGF2 Movie Social Media Talk: ఇప్పుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరో సందేహం లేకుండా బ్లాక్ బస్టర్ అని నెటిజన్లు తీర్పు ఇచ్చారు. కొందరు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తే... మరి కొందరు సినిమా మినిమమ్ 3.5 రేటింగ్ ఇచ్చారు. ఆల్రెడీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. హిట్ టాక్ వచ్చింది కాబట్టి రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని యష్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.