కేజీయఫ్ తాత ఇక లేరు - అనారోగ్యంతో కన్నుమూత!

కేజీయఫ్ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించిన కృష్ణాజీ అనారోగ్యంతో మరణించారు.

Continues below advertisement

కేజీయఫ్ సినిమాలో హీరోకు విపరీతంగా ఎలివేషన్లు ఇచ్చే పాత్రలో నటించిన నటుడు కృష్ణాజీ రావు అనారోగ్యంతో మరణించారు. కేజీయఫ్ తాతగా ఈయన ప్రేక్షకుల మెప్పు పొందారు. కేజీయఫ్ రెండు భాగాల్లో ఈయన కీలక పాత్రలో కనిపించారు. అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం కృష్ణాజీ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన హాస్పిటల్‌లో చేరారని, చికిత్స పొందుతూనే మరణించారని శాండిల్‌వుడ్ వర్గాలు పేర్కొన్నాయి.

Continues below advertisement

ఆంధ్రా - కర్ణాటక సరిహద్దుల్లోని ఓ గ్రామంలో పుట్టిన కృష్ణాజీ సినిమారంగంలో అడుగుపెట్టాలని కోరికతో బెంగళూరుకు వెళ్లారు. అయితే అవకాశాలు లభించకపోవడంతో కొన్ని నెలలు జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేశారు. అనంతరం పలువురు ప్రముఖుల దర్శకుల వద్ద అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్‌గా సుమారు 40 సినిమాలకు పనిచేశారు.

సుమారుగా 500 వరకు చిత్రాలకు సెన్సార్ స్క్రిప్టు రాశారు. ఓ మేనేజరు చెప్తే కేజీయఫ్ సినిమా ఆడిషన్‌కు వెళ్లారు. ఆడిషన్స్‌లో తన ప్రతిభని నిరూపించుకొని అందులోని అంధుడి పాత్రకు ఎంపికయ్యారు. యష్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో కృష్ణాజీది తక్కువ నిడివి ఉన్న పాత్రే అయినా తనకు మంచి పేరు వచ్చింది.

కేజీయఫ్‌లో హీరో పవర్ గురించి ఆయన చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులతో విజిల్స్ కొట్టించాయి. ఈ పాత్ర పెద్ద సక్సెస్ కావడంతో కృష్ణాజీకి నటుడిగా వరుస అవకాశాలు వచ్చాయి. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నానో నారాయణప్ప’ అనే సినిమా త్వరలో విడుదల కానుంది.

Continues below advertisement