KGF 2 Movie Collections and Records: యశ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఉత్తరాదిలో అతడికి లభిస్తున్న క్రేజ్, 'కేజీయఫ్ 2' చిత్రానికి వస్తున్న వసూళ్లే అందుకు ఉదాహరణ. ఈ రోజు విడుదలైన సినిమా అడ్వాన్సు బుకింగ్స్‌తో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా హిందీ వెర్షన్ తొలి రోజు సుమారు 40 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పాలి.


'కేజీయఫ్ 2' సినిమా పదివేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. అందులో 4400 ప్లస్ స్క్రీన్స్ నార్త్ ఇండియాలో ఉన్నాయి. ఆల్రెడీ సినిమాపై క్రేజ్ విపరీతంగా ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ బావున్నాయి. బుధవారం రాత్రికి 55 శాతం ఆక్యుపెన్సీ ఉంది. రూ. 38.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటికే 40 కోట్లు దాటిందని సమాచారం. సాయంత్రానికి ఇంకా పెరగొచ్చు. ఉత్తరాదిలో సినిమాకు మంచి స్పందన లభిస్తోంది.


Also Read: 'కేజీయఫ్ 2' సినిమా రివ్యూ: నో డౌట్ - బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌, యశ్ అదుర్స్ అంతే!


'ఆర్ఆర్ఆర్' కంటే ఈ వసూళ్లు ఎక్కువ. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కలయికలో వచ్చిన ఆ సినిమాకు హిందీలో తొలిరోజు పాతిక కోట్ల రూపాయలు (హిందీ ప్లస్ సౌత్ వెర్షన్స్ కలిపి) వచ్చాయని సమాచారం. దక్షిణాదిలో వసూళ్లు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఉత్తరాదిలో మాత్రం 'ఆర్ఆర్ఆర్' రికార్డులు బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది హిందీలో హయ్యస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమా 'కేజీయఫ్ 2' అని చెప్పాలి.  


Also Read: 'కేజీఎఫ్ 3' ఉందండోయ్, అమెరికాలో రాకీ భాయ్ రఫ్ఫాడిస్తే?