Just In





Ajay Devgn: తప్పు చేశా, రెండు సార్లు జైల్లో పెట్టారు - అజయ్ దేవగన్ వ్యాఖ్యలు
గతంలో అజయ్ దర్శకుడిగా 'యూ మే ఔర్ హమ్', 'శివాయ్' వంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు 'రన్ వే 34' సినిమా ప్రేక్షకులను అలరించబోతుంది.

బాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ దేవగన్.. ఏడాదికి రెండు, మూడు సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారారు. ఇటీవల విడుదలైన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో కీలకపాత్రలో కనిపించి మెప్పించారు అజయ్ దేవగన్. ప్రస్తుతం ఆయన నటించిన 'రన్ వే 34' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్, ఆకాంక్ష సింగ్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో నటించడంతో పాటు దర్శకుడిగా కూడా వ్యవహరించారు అజయ్ దేవగన్.
గతంలో అజయ్ దర్శకుడిగా 'యూ మే ఔర్ హమ్', 'శివాయ్' వంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు 'రన్ వే 34' సినిమా ప్రేక్షకులను అలరించబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రబృందం. ఇందులో భాగంగా అజయ్ దేవగన్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.
తన చిన్నతనంలో చేసిన తప్పులను ఒప్పుకున్నారాయన. ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో చాలా తప్పులు చేస్తుంటారని.. కానీ తాను అంతకన్నా ఎక్కువే చేశానని.. ఫలింతంగా రెండు సార్లు జైల్లో పెట్టారని తెలిపారు. ఒకసారి తన తండ్రి గన్ ను ఆయనకు తెలియకుండా దొంగిలించడంతో జైలుకి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. మరోసారి కూడా తప్పు చేసి జైలుకి వెళ్లానని చెప్పారు. కాలేజ్ లో చదువుకునే రోజుల్లో గూండాలా ప్రవర్తించేవాడినని.. నేటి జనరేషన్ కి తెలియదు కానీ ఆరోజుల్లో చాలా ఎంజాయ్ చేశామని చెప్పుకొచ్చారు.
Also Read: 'బీస్ట్' సినిమా టికెట్స్ కొంటే పెట్రోల్ ఫ్రీ - ఎక్కడో తెలుసా?