'కెజియఫ్ 2' సినిమా ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో అరుదైన రికార్డు సృష్టించింది. యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఖాతాలో వెయ్యి కోట్లు చేరాయి. అవును... 'కెజియఫ్ 2' ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సో... నిర్మాత విజయ్ కిరగందూర్‌కి మంచి లాభాలు వచ్చాయని వేరే చెప్పాల్సిన పని లేదు కదా!


ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన నాలుగో సినిమాగా 'కెజియఫ్ 2' రికార్డులకు ఎక్కింది. దీని కంటే ముందు ఉన్న సినిమాల్లో ఈ ఘనత సాధించిన సినిమాల్లో ఆమిర్ ఖాన్ 'దంగల్', ప్రభాస్ 'బాహుబలి 2', ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' ఉన్నాయి. అందులో రెండు సినిమాలు రాజమౌళివే కావడం విశేషం.






'కె.జి.యఫ్ 2'లో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించారు. ఇందులో ప్రధానమంత్రి రమికా సేన్ పాత్రలో రవీనా టాండన్, అధీరాగా సంజయ్ దత్, విజయేంద్ర వాసిరాజు పాత్రలో ప్రకాశ్ రాజ్, సలార్ తల్లిగా కీలక పాత్రలో ఈశ్వరీ రావుతో పాటు పలువురు నటించారు. రవి బస్రూర్ సంగీతం, భువన గౌడ ఛాయాగ్రహణం సినిమాను మరో మెట్టు ఎక్కించాయని విమర్శకులు, ప్రేక్షకులు చెబుతున్నారు. 


Also Read: చిరంజీవి, రామ్ చరణ్ 'ఆచార్య' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?


ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదలైంది. ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదలైంది. ఇంకా కొన్ని థియేటర్లలో 'కెజియఫ్ 2' ప్రదర్శింపబడుతోంది. ఫైనల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందనేది చూడాలి.


Also Read: 'ఆచార్య'తో కొరటాల శివకు 25 కోట్లు లాస్? వచ్చేది పోయె, వస్తుందని అనుకున్నదీ పోయె!