సోనూ సూద్... సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తారు. కానీ, రియల్ లైఫ్ లో ఆయన వేరు. ప్రజల్లో ఆయనకు ఉన్న ఇమేజ్ వేరు. కరోనా కాలంలో ప్రజలకు సోనూ సూద్ ఎంతో సేవ చేశారు. అందరి చేత రియల్ హీరో అనిపించుకున్నారు. 


కరోనా కాలం సోనూ సూద్ లో సేవా గుణాన్ని ప్రజలకు పరిచయం చేసింది. అప్పటి వరకూ నటుడిగా సోనూ సూద్ ను, ఆయన నటనను అభిమానించిన ప్రజలు... కరోనా తర్వాత సోనూ సూద్ ను మంచి మనిషిగా చూడటం మొదలు పెట్టారు. ఆ అభిమానం 'ఆచార్య' థియేటర్ల దగ్గర స్పష్టంగా కనిపించింది. 


సినిమా విడుదల అంటే అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు. స్టార్ హీరోల ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర కటౌట్స్ కడతారు. పాలాభిషేకం చేస్తారు. 'ఆచార్య' విడుదల అయిన పలు థియేటర్ల దగ్గర చిరంజీవి, రామ్ చరణ్ కటౌట్స్ కట్టారు ఫ్యాన్స్. అయితే, ఓ థియేటర్ దగ్గర 'ఆచార్య'లో విలన్ రోల్ చేసిన సోనూ సూద్ కటౌట్ (Sonu Sood Cut Out) పెట్టారు కొందరు. ఆయనకు పాలాభిషేకం చేశారు. 'బాహుబలి 2'కి రానా కటౌట్ పెట్టారు. ఆ తర్వాత ఒక విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కటౌట్ పెట్టడం బహుశా తెలుగునాట ఇదే తొలిసారి అనుకుంట!



Also Read: 'ఆచార్య' రివ్యూ: చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే?



తనపై ఇంత ప్రేమ, ఆదరణ చూపించిన ప్రేక్షకులకు సోనూ సూద్ థాంక్స్ చెప్పారు. కటౌట్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'ఆచార్య' (Acharya) లో ఆయన బసవ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.


Also Read: 'ఆచార్య'తో కొరటాల శివకు 25 కోట్లు లాస్? వచ్చేది పోయె, వస్తుందని అనుకున్నదీ పోయె!