Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

'కెజియఫ్', 'కెజియఫ్ 2' చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాలు అందుకోవడంతో పాటు పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్, త్వరలో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్నట్టు సమాచారం.

Continues below advertisement

ప్రశాంత్ నీల్... ఈ పేరే ఒక సంచలనం! 'కెజియఫ్', ఆ తర్వాత 'కెజియఫ్ 2' (KGF 2 Movie) చిత్రాలు బాక్సాఫీస్ బరిలో సృష్టించిన ప్రభంజనం అటువంటిది. ఆ రెండు విజయాలతో ప్రశాంత్ నీల్ పారితోషికం కోట్లకు చేరుకుంది. ఇప్పుడు ఒక్కో సినిమాకు ఆయన సుమారు 50 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని ఫిల్మ్ నగర్ టాక్. 'కెజియఫ్ 2'కు ఆయన పాతిక కోట్లు తీసుకున్నారట.
 
ప్రశాంత్ నీల్ రెమ్యూనరేషన్ ఎంత అనేది పక్కన పెడితే... సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన డబ్బులో కొంత మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయడానికి ఆయన రెడీ అవుతున్నారని తెలుస్తోంది. 

Continues below advertisement

Prashanth Neel Starts Production House : నిర్మాతలుగా మారుతున్న దర్శకుల జాబితాలో అతి త్వరలో ప్రశాంత్ నీల్ కూడా చేరనున్నారు. ఆల్రెడీ ఆయన ప్రొడక్షన్ హౌస్‌కి సంబందించిన పనులు స్టార్ట్ అయ్యాయని తెలుస్తోంది. కథలు ఓకే చేసి, నిర్మాణ బాధ్యతలు మరొకరికి అప్పగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వేరొక నిర్మాణ సంస్థతో కలిసి ప్రొడక్షన్ చేసినా చేయవచ్చు.
 
శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో ప్రశాంత్ నీల్ వెబ్ సిరీస్?
Prashanth Neel To Produce A Web Series In Srinivas Gavireddy Direction : రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు', 'అనుభవించు రాజా' సినిమాలు తీసిన శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో ప్రశాంత్ నీల్ ఒక వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. ఏడాది క్రితమే ఆయన కథ విన్నారట. అప్పటి నుంచి చర్చలు జరుగుతున్నాయని టాక్. మరో వైపు వెబ్ సిరీస్ కాదు... ఒక చిన్న సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని కొందరు అంటున్నారు.

Also Read : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక
 
ప్రభాస్ 'సలార్'తో బిజీ!
ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో రూపొందుతోన్న 'సలార్' సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమా పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించారు. డీవీవీ దానయ్య నిర్మాణంలోనూ ప్రశాంత్ నీల్ ఒక సినిమా చేయాలి. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ టాక్.

ప్రస్తుతానికి 'సలార్' సినిమాపై ప్రశాంత్ నీల్ దృష్టి పెట్టారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్నారు. దీని తర్వాత 'కెజియఫ్ ౩' తీస్తారా? లేదంటే ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ చేస్తారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. 'కెజియఫ్ 2' ఎండ్ టైటిల్స్ తర్వాత మూడో పార్ట్ ఉంటుందని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అమెరికా నేపథ్యంలో ఆ కథ ఉంటుందని ఆల్రెడీ హింట్ ఇచ్చారు.   

Also Read : 'ఖైదీ' సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన కార్తీ - విజయ్ సినిమాతో ముడి పడిన మేటర్ మరి

Continues below advertisement