Suriya Karuppu Movie Opening Day Collections: నటుడిగా సూర్యకు క్రిటిక్స్ అండ్ ఫ్యాన్స్ నుంచి ప్రతిసారీ అప్రిసియేషన్ వస్తుంది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ సక్సెస్ మాత్రం రావడం లేదు. 'వీరభద్రుడు'తో ఆయన భారీ విజయం అందుకున్నారా? లేదా? అసలు ఈ సినిమాకు ఓపెనింగ్ డే ఎన్ని కోట్లు వచ్చాయి? బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? అనేది తెలుసుకోండి.

Continues below advertisement

మొదటి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేశారంటే?Karuppu Box Office Collection Day India Net: తమిళంలో 'కరుప్పు' సినిమాకు ఓపెనింగ్ డే బంపర్ స్టార్ట్ లభించింది. అక్కడ డబుల్ డిజిట్ దాటింది. తెలుగు విషయానికి వస్తే పర్వాలేదు. ఏ భాషలో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? అనేది చూస్తే...

Also Read: 'వీరభద్రుడు' రివ్యూ: క్షేత్ర పాలకుడిగా సూర్య తాండవం... మరి సినిమా? ఎలా ఉందంటే?

Continues below advertisement
  • ఇండియాలో 'కరుప్పు' (తమిళ వెర్షన్) మొదటి రోజు 12 కోట్ల రూపాయల నెట్ కలెక్ట్ చేసింది. తెలుగు వెర్షన్ 'వీరభద్రుడు' 2.40 కోట్ల రూపాయల నెట్ కలెక్ట్ చేసింది.
  • తమిళ్ (కరుప్పు), తెలుగు (వీరభద్రుడు) వెర్షన్స్ మొదటి రోజు నెట్ కలెక్షన్స్ రూ. 14.40 కోట్లు
  • ఇండియాలో సినిమా మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ చూస్తే... 16.66 కోట్లు.
  • ఓవర్సీస్ నుంచి నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టిందీ సినిమా.'కరుప్పు' సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 20.66 కోట్లు అని ట్రేడ్ పోర్టల్ శాక్‌నిల్క్ వెల్లడించింది.

తమిళనాడులో అక్యుపెన్సీ ఎక్కువ...తెలుగు రాష్ట్రాల్లో అంత కంటే తక్కువమే 14న థియేటర్లలోకి రావాల్సిన 'కరుప్పు' విడుదల ఒక్క రోజు ఆలస్యమైనా సరే... భారీ ఎత్తున విడుదల చేయడంలో నిర్మాతలు సక్సెస్ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 4891 షోస్ పడ్డాయి. అందులో తమిళ షోలు 3448 కాగా... ఆక్యుపెన్సీ 54 శాతం ఉంది. తెలుగు షోలు 1443 కాగా ఆక్యుపెన్సీ 30 శాతం ఉంది.

Also Read: Exhibitors VS Producers - పర్సంటేజ్ రగడపై టాలీవుడ్ అలర్ట్... సమస్య పరిష్కారానికి కమిటీ - అందులో సభ్యులు ఎవరంటే?

'రెట్రో'లోనూ సూర్య నటనకు పేరు వచ్చింది. కానీ హిట్ రాలేదు. బాక్సాఫీస్ బరిలో సరైన సక్సెస్ కొట్టి పదేళ్లు దాటింది. ఈ తరుణంలో 'వీరభద్రుడు'తో థియేటర్లలోకి వచ్చిన సూర్య తన విశ్వరూపం చూపిస్తాడా? లేదా? అని అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎదురు చూశారు. తెలుగు, తమిళ భాషల్లో విమర్శకుల నుంచి 'వీరభద్రుడు' / 'కరుప్పు' సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. మొదటి రోజు 20 కోట్లకు కాస్త ఎక్కువ కలెక్ట్ చేసిన ఈ సినిమా... రెండో రోజు ఏమేరకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి. ఆర్జే బాలాజీ ప్రతినాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నట్టి సుబ్రమణియన్, త్రిష, ఇంద్రాన్స్, అనఘా మాయా రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. 

Also ReadDil Raju On Peddi Release: 'పెద్ది' విడుదలపై సందేహాలు వద్దు... ఫిల్మ్ ఛాంబర్ మీటింగ్ తర్వాత 'దిల్' రాజు క్లారిటీ