Karthikeya 2 Movie Creates History : థియేటర్ల దగ్గర 'కార్తికేయ 2' దూకుడు స్పష్టంగా కనబడుతోంది. యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. మూడో రోజుకు బ్రేక్ ఈవెన్ సాధించిన 'కార్తికేయ 2', నాలుగు రోజుల తర్వాత నిఖిల్ కెరీర్‌లో టాప్ గ్రాసర్‌గా చేరడం విశేషం! రోజు రోజుకూ సినిమా కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఇటు తెలుగులో, అటు హిందీలో సినిమాకు అద్భుత ఆదరణ లభిస్తోంది.


Karthikeya 2 Four Days Collection Worldwide : నాలుగు రోజుల్లో 'కార్తికేయ 2' ప్రపంచవ్యాప్తంగా రూ. 32.15 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ విషయానికి వస్తే... రూ. 18.51 కోట్లు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 21.35 కోట్ల గ్రాస్ (రూ. 13.71 కోట్ల షేర్) వసూలు చేసింది. కేవలం నాలుగో రోజు మాత్రమే చూస్తే... తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.55 కోట్ల గ్రాస్ (రూ. 2.17 కోట్ల షేర్) వసూలు చేసింది.  


నాలుగు రోజుల్లో 'కార్తికేయ 2' రెండో రోజు వసూళ్లు చూస్తే...
నైజాం : రూ.  5.00 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ.  1.79 కోట్లు
సీడెడ్ : రూ. 2.14 కోట్లు
నెల్లూరు :  రూ. 47 లక్షలు
గుంటూరు :  రూ. 1.30 కోట్లు
కృష్ణా జిల్లా : రూ. 1.02 కోట్లు
తూర్పు గోదావ‌రి : రూ. 1.16 కోట్లు
పశ్చిమ గోదావ‌రి : రూ. 83 లక్షలు


రెస్టాఫ్ ఇండియా, కర్ణాటకలో 1.05 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ మార్కెట్‌లో 2.55 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది 'కార్తికేయ 2' సినిమా. ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అటు ఉత్తరాదిలో రోజు రోజుకూ సినిమా థియేటర్ల సంఖ్య పెరుగుతూ వెళుతోంది. దాంతో ఈ వారం కూడా మంచి వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 12.80 కోట్లు జరిగింది. ఆల్రెడీ ఆ అమౌంట్ వచ్చేసింది.


నిఖిల్ కెరీర్‌లో టాప్!
నిఖిల్ నటించిన సినిమాల్లో నిన్నటి వరకూ 16.55 కోట్ల రూపాయల షేర్‌తో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మొదటి స్థానంలో ఉండేది. ఇప్పుడు 18.51 కోట్ల రూపాయల షేర్‌తో ఆ సినిమాను 'కార్తికేయ 2' క్రాస్ చేసింది. 'ఎక్కడికి పోతావు...' తర్వాత స్థానాల్లో 'అర్జున్ సురవరం' (రూ. 9.88 కోట్ల షేర్), 'కేశవ' (రూ. 7.98 కోట్ల షేర్), 'కిరాక్ పార్టీ' (రూ. 7.55 కోట్ల షేర్) ఉన్నాయి. 'కార్తికేయ', 'స్వామి రారా' సినిమాలకు కూడా ఏడు కోట్లకు పైగా షేర్ వసూలు చేశాయి.


'కార్తికేయ 2'లో ఎవరెవరు ఉన్నారు?
చందూ మొండేటి (Chandoo Mondeti) 'కార్తికేయ 2'లో నిఖిల్ సరసన అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయికగా నటించారు. శ్రీనివాస రెడ్డి, 'వైవా' హర్ష చెముడు హీరో హీరోయిన్లతో పాటు ట్రావెల్ చేసే పాత్రలలో కనిపించారు. ఆదిత్యా మీనన్ (Aditya Menon), తులసి, ప్రవీణ్ (Comedian Praveen), సత్య తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.


Also Read : బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!


ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ (Abhishek Agarwal) సంయుక్తంగా నిర్మించారు. తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేశారు.


Also Read : యముడికి హాయ్ చెప్పి వచ్చినోడు - 'బిగ్ బాస్' కప్ కొట్టినోడు