కోలీవుడ్ అగ్ర హీరో కార్తీ ఖైదీ సీక్వెల్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాను నటించిన 'జపాన్'(Japan) మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తి 'ఖైదీ 2' గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా 2019లో వచ్చిన 'ఖైదీ'(Khaidi) మూవీ సూపర్ హిట్టైంది. ఈ సినిమాతోనే దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఖైదీ సక్సెస్ తో తమిళ్, తెలుగు సినిమా ఇండ్రస్ట్రీ లోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో లోకేష్ కి భారీ మార్కెట్ క్రియేట్ అయింది. అప్పటి నుంచీ ఖైదీ సీక్వెల్ గురించి చర్చ జరుగుతూనే వస్తోంది.


Also Read : నాగార్జునతో సినిమా కోసం 17 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా - ఇప్పటికీ ఆయన కథ వినలేదు, కాదంబరి కిరణ్ సంచలన వ్యాఖ్యలు!


దానికి తోడు ఖైదీని లింక్ చేస్తూ ఓ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తూ లోకేష్ తెరకెక్కించిన 'విక్రమ్', 'లియో' సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో 'ఖైదీ 2' పై మరింత అంచనాలు పెరిగిపోయాయి. రీసెంట్ గా లియో మూవీ ప్రమోషన్ టైంలో 'ఖైదీ 2' కి అంతా రెడీగా ఉంది అన్నట్లు దర్శకుడు లోకేష్ అన్నాడు. అయితే తాజాగా కార్తీ 'ఖైదీ 2' ప్రాజెక్టుకు సంబంధించి ఆసక్తికర విషయాలు బయట పెట్టాడు. కార్తీ నటించిన 'జపాన్' మూవీ దీపావళి కానుకగా విడుదల కాబోతోంది ప్రస్తుతం. ఈ మూవీ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ కోలీవుడ్ హీరో. ప్రమోషన్ లో భాగంగా కార్తీ మీడియాతో మాట్లాడుతూ 'ఖైదీ 2' గురించి క్లారిటీ ఇచ్చాడు.


" ఖైదీ 2 సినిమా చేయాలని ఎప్పటి నుంచో లోకేష్ మనసులో ఉంది. మా ఇద్దరి కాంబినేషన్లోనే ఆ సినిమా రాబోతుంది. అయితే ఇప్పటివరకు స్క్రిప్ట్ వర్క్ జరగలేదు. లోకేష్ తన తదుపరి సినిమాను రజనీకాంత్ తో చేయబోతున్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత మాత్రమే 'ఖైదీ 2' సినిమాను ఆయన మొదలుపెడతారు. నిజానికి 'ఖైదీ 2' షూటింగ్ జనవరిలోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ లోకేష్ రజనీకాంత్ సినిమా చేస్తుండడం కారణంగా 'ఖైదీ 2' ఆలస్యం అవుతోంది" అంటూ కార్తీ చెప్పుకొచ్చాడు. కాగా రజనీకాంత్ సినిమాను ముగించిన తర్వాత మాత్రమే లోకేష్ 'ఖైదీ 2' స్క్రిప్ట్  పనుల్లో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.


లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఉన్న ఎన్నో పాత్రలను 'ఖైదీ2' లో చూపించబోతున్నారు. అంతేకాకుండా 'విక్రమ్ 2', 'లియో 2' సినిమాలకు సంబంధించి లీడ్స్ ని కూడా 'ఖైదీ2' లో ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే 'ఖైదీ 2' పై అంచనాలు పీక్ స్టేజ్ లో ఉన్నాయి. కార్తీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే 2024 అర్థ భాగంలో 'ఖైదీ2' సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక కార్తీ 'జపాన్' విషయానికొస్తే.. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్. ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కార్తీ సరసన అను ఇమ్మానుయేల్ కథానాయికగా నటిస్తోంది. సునీల్, విజయ్ మిల్టన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కార్తీ ఓ దొంగగా కనిపించనున్నాడు. దీపావళి కానుకగా నవంబర్ 10న తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial