మాములుగా ఓ యాక్టర్ సక్సెస్ ట్రాక్ ను ఎలా కొలుస్తాం. ఆ యాక్టర్ యాక్టింగ్ ఎబిలిటీస్..డైలాగ్ డెలివరీ...ఎమోషన్ ను పలికించటం...డాన్స్, ఇంకా ఫైట్లు ఇలా రకరకాల కోణాలు ఉంటాయి. కానీ ఓ హీరో సక్సెస్ అవ్వాలంటే పైవన్నీ కోణాలతో పాటు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఎలాంటి స్క్రిప్ట్ ఎంచుకుంటున్నారని. న్యూఏజ్ సినిమాల్లో ఇది తప్పనిసరి. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీల రాకతో కంటెంట్ కు కొదవ లేదు. వ్యూయర్స్ పరిధి పెరిగింది. ఇప్పుడు భాష ఏమాత్రం అడ్డు కాదు. వేర్వేరు దేశాల్లో వచ్చిన సినిమాలు కూడా చూస్తున్నారు.  ఇలాంటి సిచ్యుయేషన్ లో ఓ యాక్టర్ నిరూపించుకోవాలంటే మాత్రం అందుకు కచ్చితంగా మంచి కంటెంట్ ఉన్న కథలు కావాల్సిందే. ఈ పెరామీటర్స్ అన్నీ బాగా ఫాలో అవుతాడు కాబట్టే కార్తీ అంత మంచి పేరు సంపాదిస్తున్నాడు..Spot


సూర్య ఎంత అద్భుతమైన యాక్టరో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అలాంటి సూర్య నీడలో నుంచి కార్తీ బయటకు వచ్చి తనను తను యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవటం చాలా గొప్ప విషయం. ఇదే విషయాన్ని సర్దార్ ప్రిరీలీజ్ వేడుకలో నాగార్జున చెప్పుకొచ్చాడు. అలా అన్నల నీడ నుంచి వాళ్ల ఇమేజ్ నుంచి బయటికి వచ్చి తమను తము ప్రూవ్ చేసుకున్న యాక్టర్స్ పవన్ కల్యాణ్, పునీత్ రాజ్ కుమార్ సరసన చేరగల స్థాయి కార్తీ సొంతం.


కెరీర్ బిగినింగ్ నుంచి కార్తీ చేసినన్ని ప్రయోగాలు అతనికి ఇంత మంచి ఇమేజ్ ను తీసుకొచ్చి పెట్టాయి. పరుత్తివీరన్ లాంటి సినిమా చేశాడు కార్తీ. తెలుగులో మల్లిగాడుగా వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ రోల్ కు ఇంపార్టెన్స్ ఎక్కువ. ప్రియమణికి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకు. మొదటి సినిమాలో హీరో రోల్ కు ఇంపార్టెన్స్ తక్కువ ఉంటే ఎవరైనా ఒప్పుకుంటారా కార్తీ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత స్క్రిప్టు సెల్వరాఘవన్ లో డైరెక్షన్ లో యుగానికి ఒక్కడు. అంత డేర్ అటెంప్టో ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. రేయ్ ఎవర్రా మీరంతా అని మీమ్స్ లో ఈరోజుకీ గుర్తుండిపోయే స్థాయి నటన, డిఫరెంట్ స్క్రిప్ట్ ఆ సినిమాది. ఆ సినిమా తర్వాత తనమీదున్న మాస్ జోనర్ ను దూరం చేసుకునేలా....ఆవారా సినిమా లింగు స్వామి డైరెక్షన్ లో చేశాడు. రోడ్ సినిమాలు తెలుగు, తమిళ్ లో చాలా తక్కువ. ఈ సినిమా అందుకే ఈ రోజుకు ఫ్రెష్ గా అనిపిస్తుంది. తమన్నా, కార్తీ కెమిస్ట్రీ, ఆ పాటలు ఈ రోజుకీ మనల్ని హాంట్ చేస్తున్నాయి. ఆ నెక్ట్స్ నా పేరు శివ స్క్రిప్ట్ చూడండి.  ఇలా చెప్పుకుంటూ పోతే కార్తీ స్క్రిప్ట్ సెలక్షన్ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది.


 శకుని, బిర్యానీ, కాష్మోరా, తమ్ముడు, దేవ్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ ఫ్లాప్స్ అయ్యి ఉండొచ్చు. కానీ కార్తీ స్క్రిప్ట్ సెలక్షన్ లోనూ అవి డిఫరెంట్ అటెంప్ట్స్ అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇక కార్తీ కి సూపర్ స్టార్ స్టేటస్ తెచ్చిన సినిమాల్లో మద్రాస్, ఊపిరి, ఖాకీ, ఖైదీ ఇప్పుడు సర్దార్ లాంటి సినిమాలు చూస్తే కార్తీ ఎంత ప్రత్యేకమైన నటుడో అర్థం అవుతుంది. ఖాకీలో క్రిమినలాజీ గురించి, క్రైమ్ కేస్ స్టడీస్ గురించి ఎంత బాగా చూపించారో...ఖైదీలో ఢిల్లీగా కార్తీని చీకట్లో, సింగిల్ కాస్ట్యూమ్ లో, హీరోయిన్ లేకుండా, ఓ లారీ డ్రైవర్ గా లోకేశ్ కనగరాజ్ అంతే బాగా చూపించారు. ఇవన్నీ కార్తీ స్పెషల్ మూమెంట్స్. ఇప్పుడు మణిరత్నంతో పొన్నియల్ సెల్వన్ లాంటి భారీ సినిమా అందులో కార్తీ పాత్రకు మంచి అప్లాజ్ వచ్చిన తర్వాత విడుదలైన  సర్దార్ కూడా ఇండియన్ స్పై థ్రిల్లర్ గా అద్భుతమైన టాక్ తెచ్చుకోవటంతో...కార్తీ స్క్రిప్ట్ సెలక్షన్స్ పై అందరూ ప్రత్యేక ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ మంచి యాక్టర్ గా ఓ నటుడు పేరు తెచ్చుకోవాలంటే కథల ఎంపిక ఎంత కీలకమో కార్తీనే ఉదాహరణగా చూపిస్తున్నారు.