తెలుగు సినిమా  ఇండస్ట్రీలో సొంత టాలెంట్ తో పైకొచ్చిన హీరోల్లో సిద్దూ జొన్నలగడ్డ ఒకడు. సిద్దూ నటించిన డీజే టిల్లు మూవీ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ గా  'డిజె టిల్లు 2 ' ను రూపొందిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది మూవీ టీమ్. కామెడీ, రొమాంటిక్ సినిమాగా రూపొందిన ‘డీజే టిల్లు’ సినిమాలో సిద్దూ చేసిన కామెడీ కొత్తగా ఉంటుంది. అందుకే ఆ సినిమా మంచి హిట్ కొట్టింది.


కెరీర్ మొదట్లో చిన్న చిన్న సినిమాలు చేసిన సిద్దూ జొన్నలగడ్డ గుంటూరు టాకీస్ సినిమాతో యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత వచ్చిన  డీజె టిల్లు సినిమాతో సిద్దూ తన కెరీర్ లోనే సూపర్ డూపర్ హిట్ ను అందుకున్నాడు. ఆ సినిమాలో సిద్దూ మ్యానరిజం, డైలాగ్స్ బాగా అలరించాయి. ముఖ్యంగా 'అట్లుంటాది మనతోని' అనే డైలాగ్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా భారీ హిట్ అవడంతో సిద్దూ కి వరుస అవకాశాలు వస్తున్నాయి.


డీజె టిల్లు హిట్ తోనే డీజే టిల్లు 2 వస్తుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పటిదాకా సినిమా గురించి సరైన అప్డేట్ రాలేదు. అయితే దీపావళి కానుకగా ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చింది మూవీ టీమ్. సినిమాకు సంబంధించి ప్రోమో, పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో  కూడా సిద్దూ అదే లుక్ తో ఎనిర్జటిక్ గా కనిపించాడు. మ్యానరిజం కూడా అలాగే ఉంది. ప్రోమోలో డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు సిద్దూ. 



డీజే టిల్లు లో గ్లామరస్ గా కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు నేహా శెట్టి. అయితే డీజె టిల్లు 2 లో కూడా ఆమె హీరోయిన్ గా వుంటుంది అని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ సీక్వెల్ లో హీరొయిన్ ను మార్చారు దర్శక నిర్మాతలు. మొదట పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీలను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరకు అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. అనుపమను హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది అని తెలుస్తోంది. సంక్రాంతి తరువాత మంచి రోజు చూసుకుని మళ్లీ ఫిబ్రవరి నెలలోనే సినిమా విడుదల చేసేందుకు సినిమా యూనిట్ అయితే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి వచ్చే ఏడాది మార్చ్ నెలలో  సినిమా  రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మలిక్ రామ్ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Also Read: యాంకర్ అనసూయ షాకింగ్ నిర్ణయం? ఇకపై కనిపించదా?