బాలీవుడ్ ప్రముఖ స్టార్ జంటల్లో సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్ ఖాన్ జంట ఒకటి. సాధారణంగా ఈ జంట ఎక్కువగా బయట పార్టీలు పబ్లిక్ ఈవెంట్ లలో తక్కువగా కనిపిస్తూ ఉంటారు. సినీ పరిశ్రమలో ఉండే పార్టీ కల్చర్ కు వారు ముందు నుంచీ వీలైనంత దూరంగానే ఉంటూ వస్తున్నారు. వీటికి వీలైనంత దూరంగా ఉండాలని ఈ కపుల్ ఎప్పటినుంచో పేర్కొంటున్నారు. ఎప్పుడూ ఇంటి వాతావరణంలో గడపడానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ జంట అప్పుడప్పుడూ తమ సన్నిహితులు, అలాగే కుటుంబ సభ్యుల కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ జంట ఓ పుట్టిన రోజు వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా ఫోటోగ్రాఫర్లు ఆ జంట వెంట పడటంతో వారికి కాస్త ఘాటుగా సమాధానమిచ్చారు సైఫ్. ఈ సందర్భంగా సైఫ్ అలీ ఖాన్ అన్న వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


అసలేం జరిగిందంటే.. ఇటీవల సైఫ్ అలీ ఖాన్ దంపతులు నటి మలైకా అరోరా, అమృత అరోరాల తల్లి జూయిస్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. ఆ వేడుక అనంతరం ఈ జంట తమ నివాసానికి బయలు దేరారు. వీరు అక్కడ నుంచి బయటకు రావడం కనిపించింది.  దీంతో ఫోటోగ్రాఫర్లు ఆ జంటను వెంబడించారు. వారి నివాసం వరకూ వారిని అనుసరిస్తూ వెళ్ళారు. దీంతో సైఫ్ వారిని చమత్కరిస్తూ ‘‘ఓ పని చేయండి, మీరు మా బెడ్ రూమ్ వరకూ రండి’’ అంటూ ఫన్నీ కౌంటర్ ఇచ్చారు. దీంతో కరీనా నెమ్మదిగా నవ్వుకుంది. ఈలోపు ఓ ఫోటో గ్రాఫర్ ‘‘సార్ మీరంటే మాకు ఇష్టం’’ అని చెప్పాడు. దానికి సైఫ్ కూడా ‘‘మీరు కూడా మాకు ఇష్టం’’ అంటూ లోపలికి వెళ్లిపోయారు. 


దీంతో ఆ ఫోటోలు, సైఫ్ డైలాగ్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇక సైఫ్ అలీ ఖాన్, కరీన్ కపూర్ ల సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘ఆదిపురుష్’ సినిమాలో సైఫ్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా కనిపించనున్నారు. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక కరీనా కపూర్ తదుపరి చిత్రం 'ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్'లో కనిపించనుంది.  అలాగే కరీనా త్వరలో టబు, కృతి సనన్‌లతో 'ది క్రూ' షూటింగ్‌ ను ప్రారంభించనుంది. కరీనా హన్సల్ మెహతా యొక్క తదుపరి చిత్రంలో కూడా కనిపిస్తుంది, ఆ మూవీ కోసం ఆమె నిర్మాతగా కూడా మారనుంది. సాధారణంగా సైఫ్ అలీ ఖాన్ ఎప్పుడు ఫోటోగ్రాఫర్లు ఎదురైనా ఫోటోలకు ఫోజులిస్తూ వారితో సరదాగా మాట్లాడుతూ ఉంటారు. అయితే, ఈ సారి సహనం నశించి ఈ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఫొటోగ్రాఫర్లు కూడా దీన్ని ఫన్నీగా తీసుకోవడంతో వివాదం కాలేదు. 


Also Read ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ను అవమానించిన బాలకృష్ణ?