బాలీవుడ్ సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్లలో కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan) ఒకరు. ఫిల్మ్ ఇండస్ట్రీ నేపథ్యం నుంచి వచ్చిన ఆవిడ గ్లామరస్ సీన్స్ చేసిన సినిమాలు ఉన్నాయి. అయితే... ఆవిడ ఎప్పుడూ బోల్డ్, రొమాంటిక్, సె... సీన్స్ మాత్రం చేయలేదు. అవి చేయడం తనకు కంఫర్టబుల్‌గా ఉండదన్నారు కరీనా కపూర్ ఖాన్. ఇంకా బోల్డ్ సీన్స్ గురించి ఏం చెప్పారంటే?


కథకు బోల్డ్, సె... సీన్స్ అవసరం ఏముంది?
కథను ముందుకు తీసుకు వెళ్ళడానికి బోల్డ్ / రొమాంటిక్ సె... సీన్ అవసరం లేదని, అది తన వ్యక్తిగత అభిప్రాయం అని కరీనా కపూర్ ఖాన్ తెలిపారు. ''మనం ఏదైనా సినిమాను కథగా చూసినప్పుడు వాటి అవసరం ఉందని, ఉంటుందని నేను అనుకోను. అవి చేసేటప్పుడు నేను సౌకర్యవంతంగా ఉండలేనని నాకు తెలుసు. అందుకే, ఇప్పటి వరకు (25 ఏళ్ళ కెరీర్) చేయలేదు'' అని కరీనా స్పష్టం చేశారు.


లైంగిక చర్యను అనుభూతిగా చూడగలిగితే...శృంగారాన్ని లేదా లైంగిక చర్యను ఇద్దరు వ్యక్తుల మధ్య అనుభూతిగా భారతీయ సమాజం చూడటం లేదనేది కరీనా కపూర్ మాటల్లో వ్యక్తం అయ్యింది. ''పాశ్చత్య దేశాల్లో లైంగిక చర్యను కథలో భాగంగా చూస్తారు. మా దగ్గర అలా కాదు. తెర మీదకు ఓ సన్నివేశాన్ని తీసుకు వచ్చేటప్పుడు దాన్ని ఎలా చూస్తారనేది కూడా ముఖ్యం. ముందు దాన్ని మనం చూసే విధానం మారాలి, గౌరవించాలి'' అని ఆవిడ పేర్కొన్నారు.


Also Read: ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!






'చమేలీ' సినిమాలో కరీనా కపూర్ వేశ్యగా నటించినా...
కరీనా కపూర్ ఖాన్ 20 ఏళ్ళ క్రితం... అంటే కెరీర్ స్టార్ట్ చేసి నాలుగైదేళ్లు కాక ముందు వేశ్య పాత్రలో నటించారు. 'చమేలీ' సినిమాలో ప్రాస్టిట్యూట్ రోల్ చేశారు. అయితే, సె... సీన్స్ మాత్రం చేయలేదు. అప్పట్లో ఆ సినిమా చేయడం తనకు హెల్ప్ అయ్యిందని చెప్పిన కరీనా, దానికి ముందు - తర్వాత అటువంటి సీన్స్ మాత్రం చేయలేదు. 'ద డర్టీ మ్యాగజైన్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరీనా కపూర్ ఖాన్ ఈ వివరాలు వెల్లడించారు.


Also Read'గుండమ్మ కథ'లో కార్తీక దీపం మోనిత... ఫుల్ ఫ్యాషన్ గురూ - అదిదా ట్విస్ట్!



హిందీలో 'కభీ ఖుషి కభీ గమ్', 'ఐత్రాజ్', 'చుప్ చుప్ కే', 'గోల్ మాల్ రిటర్న్స్', 'జబ్ వుయ్ మెట్', 'ఉడ్తా పంజాబ్', 'సింగం ఎగైన్' వంటి సినిమాల్లో కరీనా కపూర్ ఖాన్ నటించారు. అజయ్ దేవగణ్ 'సింగం ఎగైన్' మీద కరీనా కపూర్ ఖాన్ చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే, బాక్స్ ఆఫీస్ బరిలో ఆ సినిమా బోల్తా కొట్టింది. ప్రజెంట్ యష్ 'టాక్సిక్'లో ఆవిడ నటిస్తున్నట్టు టాక్.