'కేజిఎఫ్', 'సలార్' సినిమాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఫేవరెట్ డైరెక్టర్ అయ్యారు ప్రశాంత్ నీల్. ఆయనతో సినిమా చేసేందుకు బాలీవుడ్ నుంచి కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్ వరకు... హీరోలు అందరూ రెడీ. అయితే అతని దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సినిమా నిర్మించేందుకు 'దిల్' రాజు సన్నాహాలు చేస్తున్నారని ఫిలిం నగర్ టాక్.
ప్రశాంత్ నీల్ పేరు ప్రపోజ్ చేసిన దిల్ రాజు...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డబల్ హ్యాట్రిక్!?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 'గంగోత్రి'తో బన్నీ హీరోగా పరిచయమైన సరే ఆయనకు మంచి పేరు తెచ్చిన క్లాసిక్ హిట్ 'ఆర్య' ప్రొడ్యూస్ చేసింది 'దిల్' రాజు. ఆ తర్వాత 'పరుగు', 'దువ్వాడ జగన్నాథం డీజే' సినిమాలు చేశారు. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మించిన 'గేమ్ చేంజర్' ఆశించిన విజయం సాధించలేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో 50వ సినిమాగా వచ్చిన 'గేమ్ చేంజర్' అంచనాలు అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. దాంతో మరో భారీ సినిమా చేసి హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని 'దిల్' రాజు ట్రై చేస్తున్నారు. ఆయనకు ఓ సినిమా చేస్తానని అల్లు అర్జున్ ప్రామిస్ చేశారట.
Also Read: 'గుండమ్మ కథ'లో కార్తీక దీపం మోనిత... ఫుల్ ఫ్యాషన్ గురూ - అదిదా ట్విస్ట్!
అల్లు అర్జున్ ప్రామిస్ చేయడంతో ఆయనకు సరిపడా డైరెక్టర్ వేటలో దిల్ రాజు పడ్డారు. గతంలో ఆయనకు ఒక సినిమా చేస్తానని ప్రశాంత్ నీల్ ప్రామిస్ చేశారట. అయితే అడ్వాన్స్ వంటిది ఏమీ దిల్ రాజు ఇవ్వలేదు. ప్రశాంత్ నీల్ తీసుకోలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రశాంత్ నీల్ సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారట. అల్లు అర్జున్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా అయితే నేషనల్ వైడ్ క్రేజ్ ఉంటుందని ఆ కాంబినేషన్ సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు 'దిల్' రాజు. త్వరలో హీరో, దర్శకుడు మధ్య ఒక మీటింగ్ అరేంజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
వాట్ నెక్స్ట్ బన్నీ? డైరెక్టర్ ఎవరు?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏమిటి?
'పుష్ప 2' తర్వాత ఆయన ఎవరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు? అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. 'పుష్ప 2 ది రూల్' విడుదలకు ముందు గురూజీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా అనుకున్నారు. అయితే అది ఆలస్యం అవుతుందని నిర్మాత నాగవంశీ కన్ఫర్మ్ చేశారు. ఆ స్థానంలో అట్లీ సినిమా చేరింది. అయితే ఇంకా అల్లు అర్జున్ - అట్లీ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏది రాలేదు.
ఇప్పుడు అట్లీ సినిమాను అల్లు అర్జున్ స్టార్ట్ చేసినా కంప్లీట్ చేయడానికి టైం పడుతుంది. మరోవైపు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' సినిమా చేస్తున్నారు. అది కంప్లీట్ కావడానికి కూడా టైం పడుతుంది. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక కాంబినేషన్ కుదిరి అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్ 'డ్రాగన్' కాకుండా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సీక్వెల్ పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రశాంత్ నీల్ మీద ఉంది. అలాగే రామ్ చరణ్, యష్ హీరోలుగా కూడా సినిమాలు చేసేందుకు ఆయన అంగీకరించారని తెలిసింది.