Karan Johar About Animal Movie : అర్జున్ రెడ్డి మూవీతో డెబ్యూ డైరెక్టర్ గా టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డివంగా అదే సినిమాని 'కబీర్ సింగ' పేరుతో బాలీవుడ్ లో చిత్రీకరించి అక్కడ కూడా అందరి దృష్టిని తన వైపు తిప్పుకొని తన స్టామినా ఏంటో నిరూపించాడు. ఇక ఇప్పుడు 'యానిమల్' మూవీతో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు. డిసెంబర్ 1న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన అనిమల్ తొలి రోజు నుంచి ఈరోజు వరకు థియేటర్స్ లో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చి పెట్టింది. ఇప్పటికే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.900 కోట్ల మార్కును దాటి ఈ ఏడాది బాలీవుడ్ లో అత్యంత కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది.


యాక్షన్ రివెంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించగా బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి మరో కీ రోల్‌లో నటించింది. బాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషించారు. టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్ ప్రణయ్ రెడ్డి వంగ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. 'A' సర్టిఫికెట్ తో థియేటర్స్ లో రిలీజ్ అయి పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ప్రశంసల వర్షం కురిపించారు.


ఈ మేరకు యానిమల్ గురించి ఆయన మాట్లాడుతూ.. "నాకైతే 2023లో యానిమల్‌ ఉత్తమ చిత్రం. మీరు జనాల చుట్టూ ఉన్నప్పుడు వారిచ్చే తీర్పు గురించి భయపడతారు. ఆ తర్వాత ధైర్యం వచ్చింది. ఈ ప్రకటన చేసేందుకు నాకు కొంత సమయం పట్టింది. నాకు కబీర్‌సింగ్ కూడా చాలా బాగా నచ్చింది. నేను కబీర్ సింగ్‌ను ఇష్టపడుతున్నానని చెబితే, కొంతమంది వ్యక్తుల నుంచి నాకు డర్టీ లుక్ వచ్చేదనుకున్నా. కానీ ఇప్పటి నుంచి నేను వాటిని ఇక పట్టించుకోను. యానిమల్‌లో ఇంటర్వెల్ సీక్వెన్స్, క్లైమాక్స్ బాగా తీశారు. ఈ మూవీని విభిన్నంగా తెరకెక్కించారు.. ‘యానిమల్‌’కు మూవీ లవర్స్‌ నుంచి ఆమోదం రావడం.. గేమ్ ఛేంజింగ్ లాంటిది" అంటూ చెప్పుకొచ్చారు.


దీంతో యానిమల్ పై కరణ్ జోహార్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక థియేటర్స్ లో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ 'యానిమల్' స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది. జనవరి 26న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ‘యానిమల్’ రిలీజ్ అవుతుంది అంటూ ఇప్పటికే వార్తలు బయటికి రాగా అంతకంటే కాస్త ముందుగానే ఈ సినిమా ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం జనవరి 15 నుంచే యానిమల్ ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుందని అంటున్నారు. దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.


Also Read : యావరేజ్ సినిమాలకు డబ్బులిచ్చి పాజిటివ్ రివ్యూలు చెప్పిస్తున్నాం - కరణ్ జోహార్ షాకింగ్ కామెంట్స్