కన్నడ ఇండస్ట్రీలో ఇటీవల విడుదలైన ఓ చిన్న సినిమా అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుని టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ఆ సినిమానే 'హాస్టల్ హుడుగురు బేకా గిద్దరే'. డార్క్ కామెడీతో కన్నడ ప్రేక్షకులను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. నితిన్ కృష్ణమూర్తి అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా చాలా తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వసూళ్లు సాధించి కేవలం కన్నడ ఇండ్రస్ట్రీ లోనే కాకుండా అన్ని భాషల ఇండస్ట్రీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించడంతోపాటు నేషనల్ మీడియా దృష్టిని సైతం తమ సినిమా వైపు చూసేలా చేసింది. ఈ క్రమంలోనే ఈ సినిమా రీమేక్ రైట్స్ ఇప్పుడు అన్ని భాషల్లోనూ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అయితే తెలుగులో ఈ సినిమాని రిమేక్ చేయాలని కొంతమంది దర్శక నిర్మాతలు తెగ హడావిడి చేశారు.
కానీ ఈ మధ్యకాలంలో రీమేక్ల విషయంలో వస్తున్న విమర్శల నేపథ్యంలో రీమేక్ చేయడం కంటే డబ్ చేసి రిలీజ్ చేయడమే మంచిదని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో 'కేజిఎఫ్', 'కాంతారా' వంటి కన్నడ సినిమాలను ఎలా అయితే డబ్ చేసి రిలీజ్ చేశారో ఇప్పుడు 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే' సినిమాని కూడా తెలుగులో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇప్పటికే డబ్బింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు తెలుగులో 'బాయ్స్ హాస్టల్' అనే టైటిల్ మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలు కలిసి తెలుగులో ఈ సినిమాని విడుదల చేస్తున్నాయి. ఆగస్టు 26న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కానుంది.
కానీ అదే సమయంలో తెలుగులో కొన్ని పెద్ద సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయినా కూడా మేకర్స్ రిస్క్ చేసి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ యూత్ కి మరియు ముఖ్యంగా స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ కి కూడా బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇక కన్నడలో జూలై 21న విడుదలై భారీ కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమాలో తల్లిదండ్రులకు దూరంగా ఉండే హాస్టల్ కుర్రాళ్ళ ఎమోషన్స్ ను ఎంతో చక్కగా దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి.
పరుమమా పిక్చర్స్ బ్యానర్ పై రక్షిత్ శెట్టి సమర్పణలో వచ్చిన ఈ సినిమాలో కాంతారా హీరో రిషబ్ శెట్టి, రమ్య గెస్ట్ రోల్స్ లో నటించారు. 'కాంతారా', 'విరూపాక్ష' వంటి సినిమాలకు సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. గుల్ మోహర్ ఫిలిమ్స్ మరియు వరుణ్ స్టూడియోస్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించారు. కాగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి తెలుగు ట్రైలర్ ని విడుదల చేసి ప్రమోషన్ ఈవెంట్స్ ని ప్లాన్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆగస్టు 26న తెలుగులో విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా కన్నడ ఒరిజినల్ వెర్షన్ ను హైదరాబాద్ లో నిలిపివేశారు. మరి కన్నడలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగులో ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.
Also Read : 'భోళాశంకర్' లో చిరు ఆ సీన్ ని ఎలా యాక్సెప్ట్ చేశారబ్బా?