మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'భోళాశంకర్' ఆగస్టు 11న విడుదలై అంచనాలను అందుకోలేకపోయింది. విడుదలకు ముందు వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని ఆసక్తి కలిగించడంలో విఫలమవడంతో సినిమాకి ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా అంతగా జరగలేదు. ఓ మోస్తారు అంచనాలతో విడుదలైన 'భోళాశంకర్' డివైడ్ టాక్ తెచ్చుకుని మెగా ఫాన్స్ ని, ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. సినిమాలో ఏ ఒక్క అంశం కూడా ఆకట్టుకునే విధంగా లేదు. దానికి తోడు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని ఆయనకు సంబంధించిన సన్నివేశాలను ఈ క్రియేట్ చేయడమే పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. మొదటినుంచి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మేనరిజం ని ఆయన సీన్స్ ని చిరు ఎలా రీ క్రియేట్ చేసారో చూడాలని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.


కానీ సినిమా విడుదలైన తర్వాత ఆ సన్నివేశాలను చూసిన అభిమానులు ఈ ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. చిరంజీవికి ఆ సీన్స్ ఏమాత్రం సెట్ కాలేదు అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా 'ఖుషి' సినిమాలోని నడుము సీన్ ను ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. చిరంజీవి వయసుకు, ఆయన స్థాయికి ఇది ఏమాత్రం సెట్ కాలేదు అంటూ విమర్శిస్తున్నారు. ఈ సీన్లో 'శ్రీముఖి నల్ల చీర కట్టుకొని బెంచ్ పై కూర్చుని బుక్ చదువుతూ ఉండగా.. పక్కనే ఉన్న ఫ్యాన్ గాలికి ఆమె చీర కొంగు పైకి ఎగిరి నడుము కనిపిస్తుంది. అప్పుడే శ్రీముఖి పక్క బెంచ్ పై కూర్చుని డబ్బులు లెక్కబెడుతున్న చిరంజీవి గ్లాసులో నీళ్లు తాగుతూ ఆమె నడుమును ఇస్తారు. దీన్ని గమనించిన శ్రీముఖి సీరియస్ గా కొంగు సర్దుకుంటుంది. కానీ మళ్ళీ ఫ్యాన్ గాలికి చీర కొంగు ఎగరడంతో చిరంజీవి చూస్తారు.అది చూసిన శ్రీముఖి బోలాజీ.. అని పిలుస్తూ నువ్వు చూసినవ్ అని అంటుంది. హ.. చూసినా.. లేకపోతే లెక్కలు తప్పవుతాయి కదా' అంటూ ఈ సీన్ సాగుతుంది.


నిజానికి ఈ సీన్ కి థియేటర్స్ లో ఫ్యాన్స్ ఈలలు వేస్తూ గోల చేసినప్పటికీ చాలామంది ఈ సీన్ మెగాస్టార్ కి సెట్ కాలేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో ఇది కాస్త ఇప్పుడు నెట్టింట్లో ట్రోల్ అవుతుంది. ఈ వయసులో చిరంజీవి ఇలాంటి సన్నివేశాలు చేయడం, ఈ సీన్లో చిరు ఇచ్చిన హావభావాలు కొంతమంది అభిమానులకు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏమాత్రం నచ్చలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. సినిమా ఫైనల్ కట్ లో నైనా చిరంజీవి ఈ సీన్స్ ని తొలగించి ఉండాల్సిందేమో అని కొందరు అంటున్నారు.


నిజానికి ఈ సినిమా రిలీజ్ కి ముందే ఓ గ్లింప్స్ లో మెడ రుద్దుకుంటూ హ.. హ.. అనే పవన్ కళ్యాణ్ మేనరిజంను చిరంజీవి అనుకరించగా, చాలావరకు దానికి నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. కనీసం అప్పుడైనా మూవీ యూనిట్ ఈ సీన్స్ ని ఎడిటింగ్ లో తీసేస్తే బాగుండదని మరికొందరు చెబుతున్నారు. ఇంకొందరైతే అసలు చిరంజీవి సినిమాలో ఈ సన్నివేశాన్ని రీ క్రియేట్ చేయడానికి ఎలా అంగీకరించారు? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా చిరంజీవి ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు ఆలోచించాలని అంతేకాకుండా తన స్థాయికి తగ్గ సన్నివేశాలు నటిస్తే బాగుంటుందని పలువురు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.


Also Read : శ్రీదేవిని గౌరవించిన గూగుల్!




Join Us on Telegram: https://t.me/abpdesamofficial