Upendra Requests Fans About His Phone Hack: కన్నడ స్టార్ ఉపేంద్ర దంపతుల ఫోన్స్ హ్యాకింగ్‌కు గురయ్యాయి. తన ఫోన్ నెంబర్ నుంచి వచ్చిన కాల్స్, మెసేజ్‌లకు ఎవరూ రియాక్ట్ కావొద్దంటూ స్వయంగా ఆయనే సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే?

తన భార్య ప్రియాంక ఆర్డర్ చేసిన ఓ వస్తువుకు సంబంధించి సోమవారం ఉదయం ఒకరు కాల్ చేశారని ఉపేంద్ర చెప్పారు. 'ఆ తర్వాత కొన్ని హ్యాష్ ట్యాగ్స్, నెంబర్స్ ఎంటర్ చేస్తే డెలివరీ అవుతుందని చెప్పారు. ఆ తర్వాత ఆమె ఫోన్‌తో పాటు నా ఫోన్ కూడా హ్యాక్ అయ్యింది.' అంటూ వివరించారు. ఎవరైనా డబ్బులు కోరుతూ తమ ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్స్ కానీ, మెసేజ్‌లు కానీ చేస్తే ఎవరూ స్పందించొద్దని హెచ్చరించారు. సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి మెసేజ్ వచ్చినా కూడా స్పందించొద్దని విజ్ఞప్తి చేశారు.

Also Read: మహేష్ 'SSMB29' బిగ్గెస్ట్ అడ్వెంచర్ కోసం బిగ్ సెట్... హైదరాబాద్‌లో ఫేమస్ టెంపుల్ క్రియేట్ చేస్తారా?

దీనిపై ఇప్పటికే పోలీసులకు కంప్లైంట్ చేసినట్లు ఉపేంద్ర వెల్లడించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని... తెలియని వారికి ఓటీపీలు షేర్ చెయ్యొద్దని, తెలియని లింక్స్ క్లిక్ చెయ్యొద్దంటూ ఫ్యాన్స్‌కు సూచించారు.