బాలీవుడ్ వివాదాస్పద నటి, ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) ముంబైలోని బాంద్రాలో గల తన ఇంటిని అమ్మేశారట. 'ఎమర్జెన్సీ' సినిమా కోసం ఆమె ఈ పని చేసినట్లు బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ముంబైలోని బాంద్రా పలీహిల్ లో ఉన్న తన ప్రాపర్టీని రూ. 32 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. ఆ బంగ్లాను కంగనా రనౌత్ 2017 సెప్టెంబర్ లో రూ. 20.7 కోట్లకు కొనుగోలు చేశారు. దాని మీద 2022 డిసెంబర్ లో లోన్ తీసుకున్నారు. ఆ తర్వాత తన ప్రొడక్షన్ హౌస్ ఆఫీసును ఆ బంగ్లాలోనే నిర్వహిస్తున్నారు కంగనా. ఇప్పుడు ఆ బంగ్లానే ఆమె అమ్మేసినట్లు తెలుస్తోంది.
యూట్యూబ్ ఛానల్ లో యాడ్
పోయిన నెల ఒక యూట్యూబ్ ఛానెల్ లో ఒక ప్రొడక్షన్ హౌస్ కి చెందిన బంగ్లా అమ్మకానికి ఉంది అనే యాడ్ కనిపించింది. అయితే ఏ ప్రొడక్షన్ హౌస్, బంగ్లా? ఎవరిది? అనే వివరాలు ఇవ్వలేదు. కానీ, ఫొటోలు, వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు అది కంగనాదే అని గుర్తుపట్టి కామెంట్లు పెట్టారు. మణికర్ణిక ప్రొడక్షన్ హౌస్ అది గుర్తు పట్టారు చాలా మంది. ఇక ఆ యాడ్ లో బంగ్లా ధర రూ. 40 కోట్లు అని ఉంది.
అక్రమ కట్టడం అంటూ...
పలీహిల్ లోని కంగనా ఇంటిపై ఒక కంట్రవర్సీ ఉంది. అది ఒక అక్రమ నిర్మాణం అని. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ 2020లో కంగనా రనౌత్ ఇంటిని కొంతమేర కూల్చివేసి అక్రమ నిర్మాణం అని నోటీసులు ఇచ్చారు. అయితే, ఆ ఆరోపణలపై కంగనా కోర్టుని ఆశ్రయించింది. దీంతో కోర్టు స్టే ఇవ్వగా... కూల్చివేతలు నిలిపి వేశారు. ఆ తర్వాత ఆమె బీఎంసీపై రూ. 2 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. కొన్ని రోజులకు ఆ కేసును వాపస్ తీసుకుంది కంగనా.
'ఎమర్జెన్సీ' సినిమా కోసం?
కంగనా రనౌత్ డైరెక్షన్ చేసి, ఆమె ప్రొడ్యూస్ చేసిన 'ఎమర్జెన్సీ' సినిమా కోసమే ఆ బంగ్లాను అమ్మేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే... ఎమర్జెన్సీ సినిమా తెరకెక్కించి దాదాపు చాలా నెలలు గడుస్తుంది. కానీ, ఇప్పటికీ రిలీజ్ కాలేదు. కారణం ఆమెకు సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడం. ఆ సినిమాపై సిక్కుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాలో తమను తప్పుగా చూపించారని, తమను కించపరిచారని అందుకే రిలీజ్ చేయొద్దని, బ్యాన్ చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 6న రిలీజ్ కావాల్సిన మళ్లీ వాయిదా పడింది. ఇటీవల సినిమాకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. కొన్నిసీన్లను తొలగించాలని, డిస్క్లయిమర్లు యాడ్ చేయాలని ఆదేశించింది.
ఏంటీ సినిమా?
ఇండియాలో గత ప్రధాని ఇందిరా గాంధీ పాలనతో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. ఆ కాలంలో పరిస్థితులు ఏంటి? అనేది చూపిస్తూ ఈ సినిమా తెరకెక్కించారు. ఆ సినిమాకి కంగనా డైరెక్టర్ కాగా.. ఆమె ఇందిరా గాంధీ పాత్రలో కూడా నటించారు. ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ కాగా.. దానిపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో చాలా రాష్ట్రాల్లో సినిమాని బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Also Read: పెద్ద మనసు చాటుకున్న తమిళ హీరో శింబు... తెలుగు రాష్ట్రాల వదర బాధితులకు సాయం