Jr NTR’s Devara Pre Booking Records Before Release In USA: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా 'దేవర'. ఆ రోజు తొందర్లోనే ఉంది. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ప్రపంచ వ్యాప్తంగా అదే రోజు రిలీజ్ కానుంది సినిమా. 'దేవర'పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వానికి తోడు ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లింప్స్, లుక్, పాటలు అందరినీ ఆకట్టుకోవడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇక రిలీజ్ కి ముందే 'దేవర' రికార్డులు సృష్టిస్తోంది. కలెక్షన్ ల వేట మొదలుపెట్టింది. అమెరికాలో దుమ్మురేపుతోంది.
బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న 'దేవర'
'దేవర' సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. అది కూడా అమెరికాలో. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ఆయన అభిమానులు సినిమా కోసం తహతహలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ బుకింగ్స్ చేసుకుంటున్నారు. అమెరికాలో ప్రీ బుకింగ్స్ కలెక్షన్స్ దుమ్ము రేపింది 'దేవర'. ఈ సినిమా ప్రీమియర్ షో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇప్పటికే 25 వేల టికెట్లు అమ్ముడుపోయి... దాదాపు మిలియన్ డాలర్లు వసూలు చేసింది 'దేవర' సినిమా. అమెరికాలో ఇంత రేంజ్ లో ప్రీ కలెక్షన్ చేసిన సినిమా దేవర అని విశ్లేషకులు చెప్తున్నారు.
ఇదే మొదటి సినిమా..
నార్త్ అమెరికాలో ప్రీ బుకింగ్స్, ప్రీమియర్ షో బుకింగ్స్ కి సంబంధించి ఇప్పటికే మిలియన్ డాలర్ మార్క్ దాటేసింది దేవర. 1.05 మిలియన్ డాలర్లు వసూలు చేసిందని ప్రకటించారు. అది కూడా ట్రైలర్ రిలీజ్ కాకముందే. ఇలా ట్రైలర్ రిలీజ్ కాకుండానే ప్రీ బిజినెస్ చేసిన మొదటి సినిమాగా 'దేవర' రికార్డులు సృష్టించింది. దీంతో ముందు ముందు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు ఎన్టీఆర్ అభిమానులు.
ఆకట్టుకున్న పాటలు, ఫస్ట్ గ్లింప్స్..
'దేవర' సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికైనా రిలీజైన ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్ అందరినీ ఆకట్టుకున్నాయి. పాటల గురించైతే చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ డ్యాన్స్ కి ఫిదా అయ్యారు ఆయన అభిమానులు. పాటలు,స్టెప్స్ యూత్ లో క్రేజ్ పెంచేశాయి. సముద్ర తీరం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా ఈ సినిమా. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటించారు. ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసిన జాన్వీ తెలుగులో 'దేవర'తో పరిచయం అవుతున్నారు. ఇక జాన్వీ డ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరు ఆమెకు పెద్ద ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా చేశారు. కొరటా శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'దేవర' ట్రైలర్ సెప్టెంబర్ 10న రిలీజ్ చేయనున్నారు. దీంతో మరోసారి విజువల్ ట్రీట్ ఉండబోతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.
Also Read: రణ్‌వీర్ కంటే దీపికా పదుకోన్ సంపాదనే ఎక్కువ... కుమార్తెకు వారసత్వంగా ఎంత ఆస్తి వస్తుందో తెలుసా?