Kamal Haasan Uncle Died: ప్రస్తుతం సినిమాలు, మరోవైపు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న లోకనాయకుడు, విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తన జీవితంలోని ప్రత్యేకమైన వ్యన్తిని కోల్పోయానంటూ తాజాగా కమల్‌ హాసన్‌ సోషల్‌ మీడియాలో వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. తకి ఆయన ఎవరంటే కమల్‌ హాసన్‌ మామ, పీపుల్స్‌ జస్టీస్‌ సెంటర్‌ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ (92). కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం కొడైకెనాల్‌లో కన్నుమూశారు. పరమకుడి ప్రాంతానికి చెందిన శ్రీనివాసన్‌ గతంలో ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేశారు. అనంతరం కొంతకాలంగా కొడైకెనాల్‌లో నివసిస్తున్న ఆయన నిన్న అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని నేడు చెన్నైకి తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నారు


నా వ్యక్తిత్వ వికాసానికి మామ ప్రధాన పాత్ర పోషించారు


తన మామ మరణంపై కమల్‌ హాసన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ నివాళులు అర్పించారు.  కమల్‌ ట్వీట్‌ చేస్తూ.. "నా వ్యక్తిత్వ వికాసానికి అంకుల్ ఆరుయిర్ శ్రీనివాసన్ ప్రధాన పాత్ర పోషించారు. మామ వాసు తన విప్లవాత్మక ఆలోచనలు, ధైర్య సాహసాల్లో వీరోచితమైన వ్యక్తి. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. కొడైకెనాల్‌లో మరణించిన ఆయన భౌతికకాయాన్ని సోమవారం రాత్రి ప్రజానీతి కేంద్రం కార్యాలయానికి తీసుకువచ్చారు. రేపు (23-04-24) ఉదయం 10:30 గంటలకు బీసెంట్ నగర్ మిన్ మయన్‌లో మామ అంత్యక్రియలు జరగనున్నాయి" కమల్‌ ట్వీట్‌ చేశారు. కమల్‌ హాసన్‌ మామ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.






కమల్‌ ట్వీట్‌పై ఉదయనిధి స్టాలిన్‌ స్పందిస్తూ.. "మహాలక్ నీతి మయ్యం పార్టీ శ్రీనివాసన్ మరణ వార్త నన్ను బాధించింది. కళైజ్ఞాని కమల్ హాసన్ సర్‌ మీకు సినీ ప్రపంచంలో, రాజకీయ రంగాల్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన శ్రీ శ్రీనివాసన్ మరణం మీకు తీరని లోటు అని తెలుసు. మీకు, ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అంటూ ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  అలాగే శ్రతి హాసన్‌ కూడా తన తాతకు మరణంపై ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నివాళులు అర్పించింది. 



Also Read:


హాట్‌టాపిక్‌గా రామ్‌ చరణ్‌  'గేమ్‌ ఛేంజర్‌' రెమ్యునరేషన్‌ - ఎంతో తెలుసా?