Kamal Haasan and Simbu movie Thug Life UK US Premieres Report: లోక నాయకుడు కమల్ హాసన్, కోలీవుడ్ యంగ్ హీరో శింబు కలిసి నటించిన సినిమా 'థగ్ లైఫ్'. ఈ సినిమా ఫస్ట్ ప్రీమియర్ ఎక్కడ పడుతుందో తెలుసా? యూకేలో! ఆ తర్వాతే అమెరికాలో ప్రీమియర్ మొదలు కానుంది. ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్ కూడా ఓవర్సీస్ నుంచి వచ్చే రిపోర్ట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'థగ్ లైఫ్' ఫస్ట్ ప్రీమియర్ ఎన్ని గంటలకు పడుతుంది? ట్విట్టర్ రివ్యూస్ ఏ టైంకి వస్తాయి? అనేది ఒకసారి తెలుసుకోండి.
యూకేలో రాత్రి 11:15 గంటలకు...ఇండియాలో తెల్లవారుజామున 03:45 గంటలకు!'థగ్ లైఫ్' ఫస్ట్ ప్రీమియర్ షో జూన్ 3వ తేదీన రాత్రి 11:15 గంటలకు యూకేలో పడుతుంది. మన ఇండియన్ టైమింగ్ విషయానికి వస్తే... జూన్ 4వ తేదీ తెల్లవారుజామున 3:45 గంటలకు అన్నమాట.
'థగ్ లైఫ్' సినిమా రన్ టైం 2.45 గంటలు. ఇంటర్వెల్ 15 నిమిషాలు వేసుకున్నా... షో కంప్లీట్ కావడానికి మూడు గంటలు పడుతుంది. యూకే ప్రీమియర్ రిపోర్ట్స్ జూన్ 4వ తేదీ ఉదయం ఏడు గంటలకు వచ్చే అవకాశం ఉంది. ఇంటర్వెల్ తర్వాత ఫస్ట్ హాఫ్ ట్విట్టర్ రివ్యూస్ వస్తాయనుకోండి.
అమెరికాలో రాత్రి 7 గంటలకు...ఇండియాలో తెల్లవారుజామున 4:30 గంటలకు!యూకేలో ప్రీమియర్ షో పడిన 45 నిమిషాలకు అమెరికాలో ప్రీమియర్ షోస్ పడతాయి. రెండిటి టైమ్ జోన్ వేరు అనుకోండి. అమెరికన్ టైమింగ్ ప్రకారం జూన్ 3న రాత్రి 7 గంటలకు ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. ఇండియన్ టైమింగ్ ప్రకారం... జూన్ 4వ తేదీ తెల్లవారుజామున 4:30 గంటలకు షోస్ మొదలు అవుతాయి. అటు ఇటుగా ఉదయం 7:30 గంటలకు పూర్తి అవుతాయి.
Also Read: వీరమల్లుకు ఒక్క రూపాయి వద్దు... అడ్వాన్స్ వెనక్కి ఇస్తున్న పవర్ స్టార్
Thug Life Release Date: తమిళనాడుతో పాటు ఏపీ తెలంగాణలో జూన్ 4వ తేదీ ఉదయం 9 గంటల నుంచి షోస్ మొదలు అవుతాయి. ఇక్కడ షోలు పడే సమయానికి అమెరికా యూకే నుంచి రివ్యూస్ వచ్చేస్తాయి. సాధారణంగా తెలుగు సినిమా ప్రీమియర్లు ఒక్కోసారి మిడ్ నైట్ పడతాయి. తెలుగు సినిమాలతో పోలిస్తే తమిళ సినిమాలకు అమెరికాలో మార్కెట్ తక్కువ. మలేషియా, సింగపూర్ వంటి దేశాలలో ఉన్నంత మార్కెట్ అమెరికాలో లేదు. అందుకని అక్కడ కాస్త ఆలస్యంగా షోలు వేస్తున్నారు.
'థగ్ లైఫ్' చిత్రానికి మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వం వహించారు. అభిరామి, త్రిష కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. నాజర్ కీలక పాత్రలో నటించారు. తమిళం నుంచి కన్నడ పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల వల్ల కర్ణాటకలో సినిమాను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ ప్రొడక్షన్ హౌస్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, మణిరత్నం ప్రొడక్షన్ హౌస్ మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగులో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.