Kamal Haasan About Kalki 2898 AD: నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ కోసం సౌత్‌తో పాటు బాలీవుడ్ నుంచి నటీనటులు ఒక్కటయ్యారు. ఈ మూవీలో కోసం ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్‌ను ఒక్కచోట చేర్చాడు నాగ్ అశ్విన్. ఇంకా ఈ మూవీని ప్రేక్షకులు వెండితెరపై చూడడానికి కొన్నిరోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌తో కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూను ఏర్పాటు చేశారు నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్. అందులో టాలీవుడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కమల్ హాసన్.

Continues below advertisement


బాలీవుడ్ నుండే..


‘‘మేము తమిళ పరిశ్రమను వేలెత్తి చూపించేవాళ్లం. క్రమశిక్షణ అంటే ఏంటో తెలుగు సినీ పరిశ్రమను చూసి నేర్చుకోమని చెప్పేవాళ్లం. కానీ నాగ్ అశ్విన్ చెప్పిన ఒక్క మాట నాకు చాలా సంతోషాన్నిచ్చింది. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు తమిళ అసిస్టెంట్ డైరెక్టర్‌ను చూసి నేర్చుకో అని తనతో చెప్పేవారట. నా విషయానికొస్తే నేను బాలీవుడ్‌ను చూసి చాలా నేర్చుకున్నాను. మేము బిల్డింగ్స్‌పై నుంచి దూకుతూ షో ఆఫ్ చేసేవాళ్లం. కానీ అసలు అలా చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఎలా ఉండాలి అని నేను బాలీవుడ్‌ను చూసే నేర్చుకున్నాను. ఇప్పుడు ‘కల్కి 2898 AD’ కోసం తీసుకున్న జాగ్రత్తలు చూసి అమితాబ్ బచ్చన్ షాకవుతున్నానని అన్నారు. కానీ ‘షోలే’ సినిమా తర్వాతే షూటింగ్ సెట్‌లో జాగ్రత్తలు అనేవి పెరిగాయి’’ అని కమల్ హాసన్ గుర్తుచేసుకున్నారు.


బెదిరించేవారు..


తాను మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు సినిమాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు కమల్ హాసన్. అప్పటికీ, ఇప్పటికీ సినిమా తీసే విధానం చాలా మారిందని అన్నారు. ‘కల్కి 2898 AD’ సెట్ ఎప్పుడూ సైలెంట్‌గా ఉండేదని, ఆ విషయం తనకు నచ్చిందని కమల్ తెలిపారు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ కూడా ఒప్పుకున్నారు. ఇక ప్రభాస్ చెల్లెలు కూడా ‘కల్కి 2898 AD’ కోసం పనిచేయడాన్ని వారంతా మాట్లాడుకున్నారు. కృష్ణంరాజు హీరోగా చేస్తున్నప్పుడు తాను అసిస్టెంట్ డ్యాన్సర్‌గా ఉండేవాడినని కమల్ బయటపెట్టారు. అంతే కాకుండా వారిద్దరి మధ్య జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చారు. ‘‘కృష్ణంరాజు పెద్ద డ్యాన్సర్ కాదు. అందుకే నేనేదైనా కష్టమైన స్టెప్ చెప్పినప్పుడు నన్ను పక్కకు తీసుకెళ్లి ఆ స్టెప్ వద్దని బెదిరించేవారు’’ అంటూ నవ్వుతూ చెప్పారు.


ప్రోత్సహించాలి..


ప్రస్తుతం సినిమాల్లో నటించడానికి, సినిమాల్లోకి రావాలని కలలు కనేవారికి భాషతో సంబంధం లేదని, భాష అడ్డు రాదని తెలిపారు కమల్ హాసన్. కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్న టాలెంట్‌ను ప్రోత్సహిస్తే ఇలాంటి మరెన్నో సినిమాలు బయటికొస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘కల్కి 2898 AD’ గురించి ప్రేక్షకులు చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. భారత ప్రేక్షకులు.. ఇప్పుడు ఎలాంటి సినిమా అయినా చూడడానికి సిద్ధంగా ఉన్నారని, ‘కల్కి 2898 AD’ని వారు రిసీవ్ చేసుకుంటున్న తీరు చూస్తుంటే సంతోషంగా ఉందని తెలిపారు కమల్ హాసన్.



Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు చేతులు జోడించి క్షమాపణలు చెప్తున్నాను, నన్ను తిట్టుకోవద్దు - అమితాబ్ బచ్చన్