Kalki 2898 AD Trailer Glimpses Leaked: 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ విడుదలకు ముందు రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ కోకి భారీ షాక్ తగిలింది. జూన్ 10వ తేదీన సాయంత్రం ఏడు గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్టు ప్రొడక్షన్ హౌస్ వైజయంతీ మూవీస్ అనౌన్స్ చేసింది. అయితే, దాని కంటే ముందు నెట్టింట ట్రైలర్ వైరల్ అయ్యింది. లీకు వీరులు 'కల్కి'ట్రైలర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
నెట్టింట లీకైన 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్...సెన్సార్ కోసం ట్రైలర్ పంపిస్తే స్నేహితుడికి!ట్రైలర్ రిలీజ్ చేసే ముందు సెన్సార్ చేయించడం కంపల్సరీ. అప్పుడు టీవీలు లేదా సినిమా థియేటర్లలో ప్లే చేయడానికి ఎటువంటి అడ్డంకులు వుండవు. 'కల్కి 2898 ఏడీ' టీమ్ కూడా సెన్సార్ కోసం ట్రైలర్ పంపించింది. అయితే, ఆ ట్రైలర్ (Kalki 2898 AD Trailer)ను ఒకరు స్నేహితుడికి పంపించాడు. అక్కడికీ అతను తెలివితేటలు ప్రదర్శించాడు. వాట్సాప్ (Kalki trailer Whatsapp leak)లో ఒక్కసారి మాత్రమే చూసేలా పంపించాడు.
ఒక్కసారి ట్రైలర్ చూసి క్లోజ్ చేశాక... డిజప్పియర్ అవుతుంది. మరొకసారి ఆ వీడియో ఓపెన్ కాదు. ట్రైలర్ రిసీవ్ చేసుకున్న స్నేహితుడు అంతకంటే ఎక్కువ తెలివితేటలు ప్రదర్శించాడు. ట్రైలర్ ఒక ఫోనులో ప్లే చేసి, మరొక ఫోనులో దానిని రికార్డ్ చేసి నెట్టింట లీక్ చేశారు. అదీ సంగతి!
Also Read: లవ్ మౌళి రివ్యూ: బోల్ సీన్లు, లిప్ కిస్సులతో నవదీప్ 2.ఓ... సినిమా అంతా అంతేనా? కంటెంట్ ఉందా?
'కల్కి' నిర్మాతలపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ లీక్ కావడంతో ప్రొడక్షన్ హౌస్ వైజయంతీ మూవీస్ మీద, ప్రొడ్యూసర్ అశ్వినీదత్ మీద రెబల్ స్టార్ ప్రభాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ లీక్స్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని తిడుతూ పోస్టులు చేస్తున్నారు. ఇంతకు ముందు ఒకసారి గ్లింప్స్ లీక్ చేశారని, తర్వాత స్టిల్స్, ఇప్పుడు ట్రైలర్ లీక్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన పోస్టులు చూడండి.