Nag Ashwin about Amitabh Bachchan and Prabhas: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ - దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'కల్కి 2898 ఏడీ'. విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం రికార్డుల మీద రికార్డుల క్రియేట్ చేస్తుంది. విమర్శకుల ప్రశంసలు అందకుంటూ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లు చేసిన ఫాస్టెస్ట్‌ మూవీగా కల్కి 2898 ఏడీ రికార్డుకు ఎక్కింది. విడుదలై నెల రోజులు అవుతున్న ఇప్పటికి థియేటర్లో అదే జోరు చూపిస్తుంది. ప్రస్తుతం కల్కి టీం అంతా మూవీ సక్సెస్‌ ఎంజాయ్‌ చేస్తుంది.


ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ వరుసగా ఇంటర్య్వూలు ఇస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో నాగ్‌ అశ్విన్‌ మూవీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కల్కి స్క్రిప్ట్‌, షూటింగ్‌ కోసం 5 ఏళ్లు కష్టపడ్డంటూ ఇప్పటికే మూవీ టీం వెల్లడించింది. తాజాగా కల్కి 2898 ఏడీ విషయంలో ఆయన తీసుకున్న జాగ్రత్తలు, తారగణం ఎంపీకపై స్పందించారు. "కల్కి 2898 ఏడీ స్క్రిప్ట్‌ రాయడానికే చాలా సమయంలో పట్టింది. అయితే నటీనటుల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా. ఇందుకోసం నాలుగేళ్లు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. ముఖ్యంగా కల్కి 2898 ఏడీ క్లైమాక్స్‌ చిత్రీకరణ అన్నిటికంటే పెద్ద సవాళుగా అనిపించింది. ఇందుకోసం వందలమంది ఆర్టిస్టులు కావాలి. పైగా క్లిష్టమై వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్‌ అవసరం. ప్రతి దాన్ని మా సొంతంగా డిజైన్‌ చేసుకున్నాము.


బహుశా మేము ఇప్పటివరకు చేసిన సినిమాల్లో వీఎఫ్‌ఎక్స్‌కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది ఈ సినిమాకే అని చెప్పోచ్చు. ఇక కల్కి 2898 ఏడీ కోసం అగ్ర నటీనటుల పాత్రలన్నింటికి ప్రాధాన్యం ఉండేలా చూశాం. అద్భుతమై వీఎఫ్‌ఎక్స్‌ సీన్స్‌ని మా సొంతంగ డిజైన్‌ చేశాం" అంటూ చెప్పుకొచ్చారు. కల్కి 2898 ఏడీలో అశ్వద్దామ పాత్ర అత్యంత కీలమైనది. స్క్రిప్ట్‌ రాసేటప్పుడు ఈ పాత్రకు అమితాబ్‌ బచ్చన్‌ గారు అనుకున్నాను. ఆయనను తప్ప మరోకరిని ఊహించుకోలేదు. దేశంలోని పెద్ద స్టార్‌లలో ఆయన ఒకరు. అశ్వద్ధామ పాత్రకు ఆయన అయితేనే మరింత శక్తి తీసుకువస్తారనిపించింది. ఇక ప్రభాస్‌-అమితాబ్‌ బచ్చన్‌ల మధ్య పోరాట సన్నివేశాలు తీయాలనేది నా కల. వాళ్లు ఈ సినిమాకు ఒకే చెప్పగానే చాలా సంతోషించాను" అంటూ నాగ్‌ అశ్విన్‌  చెప్పుకొచ్చారు. 



మహాభాతరం ఇతిహాసాలకు సైన్స్ ఫిక్షన్‌ జోడించి విజువల్ వండర్ చేశాడు నాగ్‌ అశ్విన్‌. విడుదలైన ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచి పాజిటివ్‌ రివ్యూస్‌, బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. జూన్‌ 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 1100 పైగా కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌తో పాటు లోకనాయకుడు కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనె, రాజేంద్ర ప్రసాద్‌, శోభన, దిశా పటానీ వంటి భారీ తారగణం కీలక పాత్రలు పోషించగా.. దిగ్గజ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, రామ్‌ గోపాల్‌ వర్మ, విజయ్‌ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దుల్కర్‌ సల్మాన్‌ వంటి వారు అతిథి పాత్రలు పోషించారు.


Also Read: ఎన్టీఆర్‌కు ఒక్క సెకన్‌ చాలు, అదే నాకైతే 10 రోజులు - తారక్‌పై జాన్వీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌