Kantha Movie Collection Day 1: నట చక్రవర్తి దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'కాంత'. ఆయన జంటగా భాగ్య శ్రీ బోర్సే... ప్రధాన పాత్రల్లో సముద్రఖని, రానా దగ్గుబాటి నటించారు. తమిళనాడులో మొదట ప్రీమియర్ షోలు పడగా... చెన్నై క్రిటిక్స్ నుంచి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఆ తర్వాత తెలుగు క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ డిఫరెన్స్ మీద రానా సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. క్రిటిక్స్ అప్రిసియేషన్ పక్కన పెట్టి కలెక్షన్స్ ఎలా ఉన్నాయ్? అనేది చూస్తే...
ఇండియాలో ఫస్ట్ డే నెట్ @ 4 కోట్లు!Kaantha First Day India Net Collection: 'కాంత'కు మొదటి రోజు ఇండియాలో రూ. 4 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న ప్రాథమిక సమాచారం. తమిళ్ నుంచి అంత అప్రిసియేషన్ వచ్చినా మొదటి రోజు రూ. 1.5 కోట్లు మాత్రమే వచ్చాయి. తెలుగులో రూ. 2.5 కోట్లు వచ్చాయట. టోటల్ ఇండియా వైడ్ ఫస్ట్ డే నెట్ కలెక్షన్... 4 కోట్ల రూపాయలు మాత్రమే.
'లక్కీ భాస్కర్'లో సగం కూడా రాలేదా!?Kaantha Vs Lucky Bhaskar First Day Collection: హీరోగా దుల్కర్ సల్మాన్ లాస్ట్ సినిమా 'లక్కీ భాస్కర్'. ఆ తర్వాత కల్యాణీ ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఫస్ట్ ఫిమేల్ సూపర్ హీరో సినిమా 'కొత్త లోక: చాప్టర్ 1'లో అతిథి పాత్రలో సందడి చేశారు. 'లక్కీ భాస్కర్' సినిమాకు ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోలు వేశారు. యునానిమస్ హిట్ టాక్ వచ్చింది. ఆ సినిమాకు మొదటి రోజు ఇండియా టోటల్ నెట్ కలెక్షన్ రూ. 8.45 కోట్లు. ఇప్పుడు 'కాంత'కు అందులో సగం కూడా రాలేదు.
Also Read: 'కాంత' రివ్యూ: దుల్కర్ vs సముద్రఖని... మధ్యలో భాగ్యశ్రీ, రానా - మహానటి రేంజ్‌లో ఉందా?
'కాంత'కు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. రానా దగ్గుబాటితో పాటు దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూస్ చేశారు. సినిమా విడుదలకు ముందు తెలుగులో మంచి బజ్ నెలకొంది. అయితే రిలీజ్ తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చింది. యునానిమస్ హిట్ టాక్ అయితే రాలేదు.
Also Read: కార్తీక దీపం సీరియల్ దర్శకుడితో పవన్ కళ్యాణ్ సినిమా - అనౌన్స్ చేశారు కానీ...