డే 68 ఎపిసోడ్ 69లో కొత్తగా రాణి అయిన తనూజాకు తమను తాము పరిచయం చేసుకున్నారు ప్రజలు. తరువాత "నిఖిల్, తనూజా, రీతూ చివరికి మీ ముగ్గురూ రాజు రాణులుగా నిలిచి ఇమ్యూనిటీకి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. హోల్డ్ ది క్రౌన్ పోటీలో గెలిచిన వారే హౌస్ కెప్టెన్ గా నిలుస్తారు. మీ ప్రతిరూపాలకు ఉన్న క్రౌన్ ను స్వార్డ్ తో పట్టుకుని నిలబడాలి" అంటూ కెప్టెన్సీ టాస్క్ పెట్టారు. ఇందులో తనూజా విన్ అయ్యి కెప్టెన్ గా నిలిచింది. నిన్ననే రాణి అయిన తనూజా నేడు 10వ వారం కెప్టెన్ కావడం విశేషం. అలాగే బిగ్ బాస్ ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అయ్యే ఇమ్యూనిటీని ఆమెను ఇచ్చారు. అంతేకాదు మహారాణిగా పట్టాభిషేకం కూడా చేశారు. "బిగ్ బాస్ కు వెళ్తాను అంటే ఎప్పుడూ నో చెప్పే ఫ్యామిలీ ఈసారి ఓకే చెప్పారు. ఎందుకంటే అక్కడ నువ్వు రెండు వారాల కన్నా ఎక్కువ ఉండలేవు అన్నారు. 9వ వారమే ఎందుకు కెప్టెన్ ఎందుకు కావాలనుకున్నా అంటే ఫ్యామిలీ వీక్. వాళ్లకు నేను చూపించాలి" అంటూ భరణి దగ్గర 9 సెంటిమెంట్ గురించి ఓపెన్ అయ్యింది తనూజా. 

Continues below advertisement

భరణి మాస్టర్ ప్లాన్ "డ్రీమ్ కం ట్రూ అని అందరి ముందు చెప్తావేంటి ? అందరూ నన్ను అలా చూస్తున్నారు" అని తనూజాను అడిగాడు కళ్యాణ్. నా వెల్ విషర్ నువ్వు. ఇందులో ఏముందని తేలిగ్గా తీసిపారేసింది తనూజా. "ఈరోజు హైలెట్ తనూజా సపోర్టర్ భరణి అంటున్నారు. భరణి దివ్య, డెమోన్ ను సెలెక్ట్ చేశాడు. నేనే తనూజాను సెలెక్ట్ చేశాను. నిఖిల్ క్లోజ్ ఫ్రెండ్స్ నేను, సంజన. కానీ సంజన ఫ్లిప్ అయ్యింది. భరణి, సంజన ఇద్దరూ ఫేక్" అంటూ కెమెరాకు కంప్లైంట్ చేశాడు గౌరవ్. "నేను రావడమే తనూజాను, దివ్యను నామినేట్ చేయడానికి వచ్చాను. కానీ ఒక్కరినే నామినేట్ చేసే చాన్స్ వచ్చింది" అంటూ బిగ్ బాంబు పేల్చారు భరణి. తరువాత సంజన తను కెప్టెన్సీ టాస్క్ లో తనుజాకు సపోర్ట్ చేసినందుకు నిఖిల్ కు వివరణ ఇచ్చుకుంది. 

బాల్యాన్ని నెమరేసుకున్న కంటెస్టెంట్స్ "ప్రతి ఒక్కరి జీవితంలో అందమైన విషయం బాల్యం" అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చిన్నప్పటి ఫోటోలను పంపించారు. సుమన్ శెట్టి "కెమెరా పక్కన ఐస్ క్రీమ్ పెడితేనే ఫోటోకి ఫోజిచ్చానట. మా అందరికీ ఒకే ఒక్క రూమ్ ఉండేది. చాలా కష్టపడి ఎదిగాము. ఎలా పుట్టాను ఎలా పెరిగాము అనేది మర్చిపోకూడదు" అంటూ మంచి మాటలు చెప్పారు. రీతూ "మా నాన్న ఆ ఫోటో తీశారు. మా అన్న వాడినవి అన్ని నేను వేసుకునేదాన్ని. మా నాయనమ్మ నాకు అన్నం తినిపించేటప్పుడు నేను సీరియల్ లో మిమ్మల్ని చూస్తూ తినేదాన్ని. అలాంటిది నేను ఈరోజు మీతో ఇలా ఉండడం సంతోషంగా ఉంది" అని భరణితో చెప్పింది. "6 తరగతిలో డిస్ట్రిక్ట్ లెవెల్ చెస్ కాంపిటీషన్ లో ఫస్ట్ అవార్డు వచ్చింది. ఇదే ఆ ఫోటో. మా నాన్నే నాకు నేర్పించారు" అంటూ తన ఫోటో స్టోరీ చెప్పాడు.

Continues below advertisement

Also Read: బిగ్‌ బాస్ డే67 రివ్యూ... బీబీ రాజ్యంలో వారెవ్వా చెఫ్ రాయల్ డిన్నర్... కళ్యాణ్ చేజారిన కెప్టెన్సీ... తనూజాకు కలిసొచ్చిన లక్

"6వ తరగతిలో హాస్టల్ లో ఉన్నప్పుడు సడన్ గా కృష్ణాష్టమి రోజు నాకు వార్డెన్ కృష్ణుడి వేషం వేయించారు. నేను పుట్టినప్పుడు మా నాన్నకు అదృష్టం బాగా కలిసొచ్చింది బిజినెస్ లో. కానీ తరువాత మోసం వల్ల అంతా పోయింది. చిన్నప్పుడు చాలా లో చూశాను. 24 ఇయర్స్ లో 4 ఏళ్లే వాళ్లతో ఉన్నాను" అంటూ గుక్కపెట్టి ఏడ్చాడు. ఇమ్మాన్యుయేల్ తన ఫోటోను చూపిస్తూ "అప్పట్లో తినడానికి తిండిలేక నన్ను కనడం ఇష్టం లేదట మా అమ్మకు. నేను 10వ తరగతి వచ్చేదాకా కూడా చిన్న పాకలో ఉండేవాళ్ళం. మా అమ్మమ్మ వాడివల్ల లైఫ్ మారుతుంది అని చెప్పడంతో నన్ను కన్నారట. మా అమ్మ ఆకలికి పొలంలోకి వెళ్ళి మట్టి తినేదట. డిగ్రీ కంప్లీట్ అయ్యాక కూడా పార్ట్ టైమ్ జాబ్ చేశాము. మా అన్న నన్ను నాన్నలా పెంచాడు. మూడేళ్ల నుంచి సరిగ్గా మాట్లాడట్లేదు. నాతో లైఫ్ లో ఒక్క సినిమా అయినా తీసి చచ్చిపోత అంటాడు. డైరెక్టర్ అవుతాడు వాడు" అంటూ ఎమోషనల్ అయ్యాడు. .

తనూజా "యూకేజి ఫోటో ఇది. ముగ్గురం అక్కా చెల్లెళ్లం. ఆడపిల్లల్లో ఒక్కరికి బ్యాడ్ నేమ్ వస్తే ముగ్గురికీ వస్తది. ఎలా పెంచుతారో అనేవాళ్ళు. ఎవ్వరికీ చెప్పకుండా నన్ను, నా అక్కని తీసుకుని హైదరాబాద్ కి వచ్చి స్కూల్ లో చేర్పించింది మా అమ్మ. ఇండస్ట్రీలోకి యాక్సిడెంట్ గా వచ్చాను. నా లైఫ్ లో బెస్ట్ సూపర్ హీరో మా అమ్మ" అని చెప్పింది. చివరగా ప్రజలకు లగ్జరీ ఐటమ్స్ ను గెలుచుకోవడానికి క్రికెట్ ఆడించారు. ఒకొక్కరు 2 బాల్స్ ఆడి కాఫీ, మష్రూమ్, పిజ్జా, మటన్, చీజ్, బ్రౌన్ బ్రెడ్, బట్టర్, రసగుల్లా, నెయ్యి, దోశ బ్యాటర్ గెలుచుకున్నారు. తరువాత రీతూ, ఇమ్మన్య్యే ఫుల్ ఫన్ క్రియేట్ చేశారు.

Also Readబిగ్ బాస్ డే 66 రివ్యూ... దివ్య చేజారిన క్వీన్ పదవి... నిఖిల్ కొత్త కింగ్... రీతూతో సరసాలు - ఇమ్మాన్యుయేల్ కు కింగ్ పనిష్మెంట్