'గుప్పెడంత మనసు' సీరియల్, అందులోని జగతి మేడమ్ పాత్రతో తెలుగులోనూ పాపులర్ అయిన కన్నడ నటి జ్యోతి పూర్వాజ్. ఆవిడ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా 'కిల్లర్'. దీనికి దర్శకత్వం వహించడంతో పాటు సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు జ్యోతి భర్త పూర్వాజ్. మనీష్ గిలాడ మరో లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలోని 'ఫైర్ అండ్ ఐస్' పాటను ఇవాళ విడుదల చేశారు. 

Continues below advertisement


మూడు గంటలు కష్టపడి డిజైన్ చేశాం!
'కిల్లర్' సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్సును మూడు గంటలు కష్టపడి డిజైన్ చేసినట్టు యాక్షన్ కొరియోగ్రాఫర్ రాజ్ కుమార్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.... ''జ్యోతి గారు యాక్షన్ తెలియదనేవారు. మేం 3 గంటల పాటు 15 మందితో అటాక్ చేసే యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తే... అరగంటలో మొత్తం చేసేశారు. దాంతో మేం షాక్ అయ్యాం. సినిమాలో ఆవిడ యాక్షన్ సీక్వెన్సులకు మంచి రెస్పాన్స్ వస్తుంది'' అని అన్నారు.


ఐదు పాత్రల్లో జ్యోతి పూర్వాజ్ విశ్వరూపం!
స్పై, వాంపైర్, సూపర్ షీ, టెర్రరిస్ట్, రక్షా రై... 'కిల్లర్'లో ఐదు భిన్నమైన పాత్రలను జ్యోతి పూర్వాజ్ పోషించారని, ప్రతి పాత్రలో ఆమె అద్భుతంగా నటించిందని చిత్ర దర్శక నిర్మాత పూర్వాజ్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఈ చిత్ర కథకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎలిమెంట్స్ ముడిపడి ఉంటాయి. ఇదొక ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ స్టోరీ. మా నిర్మాత పద్మనాభ రెడ్డి, ఇతర టీమ్ చాలా సపోర్ట్ చేశారు'' అని అన్నారు.


Also Read: మహేష్ బాబు - రాజమౌళిల వారణాసి బడ్జెట్ ఎంత? ఇండస్ట్రీలో వచ్చిన పుకార్లు నమ్మొచ్చా? అసలు నిజం ఏమిటంటే?


డాక్టర్ టు ఐటీ... ఇప్పుడు సినిమాల్లోకి!
హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ... ''నేను డాక్టర్ కావాలనుకున్నా. కానీ ఆ కల పక్కనపెట్టి ఐటీ కంపెనీలో ఉద్యోగం చేయాల్సి వచ్చింది. అక్కడ్నుంచి సీరియల్స్ చేసి పాపులరయ్యా. ఇప్పుడు కథానాయికగా వస్తున్నా. జీవితంలో నేను ఏదీ ప్లాన్ చేయలేదు. నటి అయ్యాక మంచి స్టంట్స్‌తో యాక్షన్ మూవీ చేయాలని ఆశపడ్డా. ఆ విషయం పూర్వజ్ (Director Poorvaj)కు చెప్పా. 'మాస్టర్ పీస్' జరుగుతుండగా మరొ వైపు 'కిల్లర్' స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఇదొక కొత్త కంటెంట్ ఫిల్మ్'' అని అన్నారు.


Also Readనేనేం తప్పు చేశా... తమిళ రాజకీయాలను కుదిపేసిన పార్టీ కేసు, ట్రోల్స్‌పై హీరోయిన్ ఆవేదన



Killer Movie Cast And Crew: జ్యోతి పూర్వజ్, పూర్వజ్, మనీష్ గిలాడ, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'కిల్లర్' చిత్రానికి ఛాయాగ్రహణం: జగదీశ్ బొమ్మిశెట్టి, సంగీతం: ఆశీర్వాద్ - సుమన్ జీవ, సమర్పణ: ఉర్వీశ్ పూర్వజ్, నిర్మాతలు: పూర్వజ్, పద్మనాభరెడ్డి ఎ, రచన - కూర్పు - దర్శకత్వం: పూర్వజ్.