Actress Hema Kolla mother death news: ప్రముఖ నటి, సామాజికవేత్త హేమ కోళ్ల కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె కన్నతల్లి మరణించారు. విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ నుంచి రాజోలు వెళ్లారు హేమ.
కిడ్నీ సంబంధిత సమస్యలతో...నటి హేమ తల్లి పేరు కోళ్ల లక్ష్మి. ఆమె వయసు 80 సంవత్సరాలు. కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో సతమతం అవుతున్నారు. సోమవారం (నవంబర్ 17వ తేదీ) రాత్రి ఆకస్మిక మరణం చెందారు. తల్లి అంటే హేమకు ఎంతో ప్రేమ. మాతృమూర్తి మరణ వార్త తెలిసిన వెంటనే స్వగ్రామం రాజోలు వెళ్లారు హేమ.
Also Read: మరో వివాదంలో రాజమౌళి - ఫిలిం చాంబర్‌కు 'వారణాసి' టైటిల్ పంచాయితీ... జక్కన్న ముందున్న ఆప్షన్స్ ఏంటి?
తల్లి పార్థీవ దేహాన్ని చూసి బోరున విలపించారు హేమ. ఆమెను కుటుంబ సభ్యులు ఓదార్చారు. సోంపల్లి కైలాస భూమిలో జరిగిన లక్ష్మి అంత్యక్రియల్లో హేమతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. హేమకు ఓ సోదరుడు ఉన్నారు. ఆయన పేరు కోళ్ల శ్రీనివాస్. సొంతూరిలో లక్ష్మీ ఫ్యాషన్ స్టూడియో నిర్వహిస్తున్నారు.
Also Read: ఎన్టీఆర్, నీల్ 'డ్రాగన్' మూవీ - ఫ్యాన్స్‌కు మ్యూజిక్ డైరెక్టర్ గుడ్ న్యూస్