Music Director Ravi Brasur About NTR Prashanth Neel Movie : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'డ్రాగన్' రాబోతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూవీ షూటింగ్ జరుగుతుండగా... మ్యూజిక్ డైరెక్టర్ రవి బ్రసూర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు.

Continues below advertisement

KGF, సలార్‌లను మించేలా...

'డ్రాగన్' మూవీ కేజీఎఫ్, సలార్‌లను మించి ఉంటుందని... యాక్షన్, విజువల్స్ అంతకు మించేలా ఉంటాయని చెప్పారు రవి బ్రసూర్. ప్రశాంత్ నీల్ గత చిత్రాల కంటే డిఫరెంట్‌గా ఎన్టీఆర్ మూవీ ఉండబోతోందని అన్నారు. 'కేజీఎఫ్, సలార్ తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ మూవీకి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నా సొంతింటికి వచ్చినట్లు ఉంది. నీల్, నేను తక్కువగా మాట్లాడుకుంటూ ఎక్కువ వర్క్ చేస్తాం. 'డ్రాగన్' మూవీలో విజువల్స్‌తో పాటు మ్యూజిక్ కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది.

Continues below advertisement

ఎమోషన్స్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. యాక్షన్, ఎమోషన్, లవ్ అన్నీ కలిపి ఫ్యాన్స్ బిగ్ ట్రీట్ అందనుంది. కేజీఎఫ్, సలార్‌ల కంటే ఈ మూవీ మ్యూజిక్ డిఫరెంట్‌గా ఉంటుంది. కొత్త సంగీత పరికరాలు యూజ్ చేస్తున్నాం. పవర్ ఫుల్ యాక్షన్, మ్యూజిక్ అందరూ ఎంజాయ్ చేస్తారు.' అని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అప్డేట్ - డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ ట్రీట్

ఎన్టీఆర్ న్యూ లుక్

ఎన్టీఆర్ న్యూ లుక్ రీసెంట్‌గా సోషల్ మీడియాలో వైరల్ కాగా... 'డ్రాగన్' మూవీ కోసమే రెడీ అవుతున్నారంటూ కామెంట్స్ వచ్చాయి. ఇటీవల ఓ యాడ్ షూట్‌లో ఎన్టీఆర్ గాయపడడంతో షూటింగ్‌కు కాస్త బ్రేక్ వచ్చింది. కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత ఎన్టీఆర్ మళ్లీ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. 

ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా... మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని రవిశంకర్ భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు. ఇదివరకూ ఎన్నడూ కనిపించని మాస్ లుక్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ కనిపించనుండగా... విభిన్నమైన రోల్‌లో ఆయన నటిస్తున్నట్లు తెలుస్తోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.