Pawan Kalyan's Ustaad Bhagat Singh Movie First Single Update : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబో అవెయిటెడ్ యాక్షన్ డ్రామా 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ బర్త్ డే సందర్భంగా ఓ సాంగ్‌లో ఆయన వింటేజ్ లుక్ ఇప్పటికే రివీల్ చేశారు మేకర్స్. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్స్ లేవు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ త్వరలోనే రిలీజ్ చేస్తామంటూ టీం హింట్ ఇవ్వగా... తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు.

Continues below advertisement


బిగ్ న్యూస్ మాత్రమే...


అల్లరి నరేష్ హీరోగా నటించిన '12A రైల్వే కాలనీ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ గురించి అప్డేట్ అడగ్గా... 'చిన్న కరెక్షన్... ఉస్తాద్ గురించి చిన్న న్యూస్ ఉండదు. పెద్ద న్యూస్ ఉంటుంది. డిసెంబరులో ఫస్ట్ సాంగ్ ఉంటుంది. త్వరలోనే డేట్ రివీల్ చేస్తాం' అంటూ చెప్పారు. డిసెంబర్ 31 కల్లా మీకు జోష్ వస్తుందంటూ చెప్పగా... ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.


మెగా సర్‌ప్రైజెస్


గత 2 నెలల్లో మెగా ప్యామిలీ నుంచి వరుస సర్ప్రైజెస్ వస్తూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి 'మీసాల పిల్ల' సాంగ్ రిలీజై ట్రెండ్ సృష్టించింది. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' నుంచి 'చికిరి చికిరి' సాంగ్ దుమ్ము రేపింది. ఇప్పుడు అదే కోవలో 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి కూడా ఫస్ట్ సింగిల్ ట్రెండ్ సెట్టర్ కావడం ఖాయమని... సాంగ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నామంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఈ మూవీకి రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడం మరో హైలెట్.






Also Read : 'NBK111'లో నయనతార ఫస్ట్ లుక్ - బాలయ్య ఎంపైర్‌లోకి పవర్ ఫుల్ క్వీన్ ఎంట్రీ


పవన్ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీలతో పాటు రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కనిపించనుండగా... ఫోటోగ్రాఫర్ పాత్రలో రాశీ ఖన్నా నటిస్తున్నారు. పార్తీబన్ విలన్ రోల్ చేస్తుండగా... కేఎస్ రవికుమార్, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేం అవినాష్, రాంకీ, టెంపర్ వంశీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్‌కు 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


గతంలో పవన్, హరీష్ కాంబోలో వచ్చిన 'గబ్బర్ సింగ్' బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ సాధించింది. అందులోనూ పవన్ పోలీస్ ఆఫీసర్‌గానే కనిపించారు. ఇప్పుడు కూడా అదే కాంబో అదే రోల్ రిపీట్ అవుతుండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. దేవిశ్రీ మ్యూజిక్‌తో పాటు డైరెక్టర్ మ్యాజిక్‌తో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ ఫ్యాన్స్ అంటున్నారు.