Rajamouli Comments On Hanuman In Globetrotter Event Makes Controversy : దర్శక ధీరుడు 'వారణాసి' ఈవెంట్‌లో హనుమంతుడిపై చేసిన కామెంట్స్ కాంట్రవర్శీకి దారి తీసిన సంగతి తెలిసిందే. దీనిపై నెటిజన్లు ఆయనపై ఫైర్ అయ్యారు. తాజాగా హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై రాష్ట్రీయ వానర సేన ఫిర్యాదు చేసింది. 

Continues below advertisement

'కేసు నమోదు చేయండి'

ఈ నెల 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన 'వారణాసి' టైటిల్ లాంచ్ ఈవెంట్‌లో రాజమౌళి చేసిన కామెంట్స్‌పై రాష్ట్రీయ వానరసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 'ఈవెంట్‌లో కావాలనే హిందువుల ఆరాధ్య దైవమైన హనుమంతునిపై విధ్వేషాన్ని నింపుకొని ప్రజలందరి ముందు, మీడియా, సినీ ప్రముఖుల ముందు ఈయనేం దేవుడు? ఇతను దేవుడా? అని అవమానకరంగా మాట్లాడారు. ఈ విధ్వేషపూరిత వీడియోను ఉపయోగించుకుని తన సినిమాకు ఫ్రీగా పబ్లిసిటీ, సినిమాకు అధిక లాభాలు తెప్పించుకోవాలని చూస్తున్నారు.

Continues below advertisement

స్వలాభం కోసం మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న ఇలాంటి వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించి ఇలాంటి కామెంట్స్ చేయకుండా నిరోధించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. హిందూ దేవుళ్ల పేర్లు చెప్పి వేలాది కోట్లు సంపాదిస్తున్న ఈ సినీ రంగ ప్రముఖులు ఇలాంటి స్పీచెస్‌తో మతాల మధ్య విధ్వేషం రగిలిస్తున్నారు. కావున సదరు దర్శకుడిపై కేసు నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోగలరు. లేకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం.' అని పేర్కొన్నారు.

Also Read : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ 'ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్' - నో డైలాగ్స్... టీజర్‌తోనే హైప్ క్రియేట్ చేశారు

రాజమౌళి ఏమన్నారంటే?

'GlobeTrotter' ఈవెంట్‌లో టైటిల్ గ్లింప్స్ ప్లే అవుతుండగా టెక్నికల్ గ్లిచ్‌తో కాస్త బ్రేక్ పడింది. కొంత టైం తర్వాత 100 అడుగుల బిగ్ స్క్రీన్‌పై వీడియో ప్లే చేశారు. ఆ తర్వాత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్... 'రాజమౌళి గుండెపై హనుమాన్ ఉన్నాడు. ఆయన వెనకుండి నడిపిస్తున్నాడు. ఆయన ద్వారా మాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది.' అంటూ కామెంట్ చేశారు. 

ఆ తర్వాత రాజమౌళి స్పీచ్ ఇస్తూ తనకు దేవుడిపై నమ్మకం లేదని అన్నారు. 'నాకు దేవుడంటే పెద్దగా నమ్మకం లేదు. నాన్న మాట్లాడుతూ హనుమాన్ నా వెనకుండి నడిపిస్తాడని అన్నారు. ఇలా అయిన వెంటనే నాకు కోపం వచ్చింది. ఇదేనా నడిపించేది అని.' అంటూ కామెంట్ చేశారు.

నెటిజన్ల ఫైర్

ఈ వీడియో వైరల్ కాగా నెటిజన్లు రాజమౌళి తీరును తప్పుబట్టారు. హనుమాన్‌పై అలా మాట్లాడడం ఏంటంటూ విమర్శించారు. అందరికీ చూపించాల్సిన ఈవెంట్‌ను జియో హాట్ స్టార్ ఇన్ కం పెంచేందుకు వాడి హనుమాన్‌ను ఎందుకు తప్పుపడతారు? అంటూ ప్రశ్నించారు. మరికొందరు... 'టెక్నికల్ గ్లిచ్ వస్తే హనుమాన్ ఏం చేస్తాడు?. మీ సినిమా హైప్ ఏమాత్రం తగ్గదు. అయితే మీరు అన్న మాటలు మాత్రం మిగిలిపోతాయి.' అంటూ కామెంట్స్ చేశారు. తాజాగా రాష్ట్రీయ వానర సైన్యం నేరుగా పోలీసులకు రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.