Priyanka Chopra Learn Telugu For Varanasi Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి 'వారణాసి' టైటిల్ అనౌన్స్‌మెంట్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా GlobeTrotter ఈవెంట్‌లో జరిగిన సంగతి తెలిసిందే. మహేష్ ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్‌తో ఓ సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు జక్కన్న. ఇక ఈవెంట్‌లో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.

Continues below advertisement

తెలుగులో క్యూట్‌గా...

స్టేజ్‌పై 'హలో హైదరాబాద్' అంటూ అభిమానులను పలకరించిన ప్రియాంక... 'తగలబెట్టేద్దామా?' అంటూ క్యూట్‌గా అనడం హైలెట్ అవుతోంది. ఈవెంట్ కోసం ఆమె తెలుగు ప్రాక్టీస్ చేసిన వీడియో షేర్ చేయగా వైరల్ అవుతోంది. సినిమాల్లో కంటే ఆడియన్స్ ముందు తెలుగులో మాట్లాడడం చాలా కష్టం అని అన్నారు. తెలుగులో మాట్లాడడం కోసం ఓ స్పెషల్ డైరీ కూడా మెయింటెన్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు క్యూట్ తెలుగు, డెడికేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Continues below advertisement

Also Read : రెండు పార్టులుగా ప్రభాస్ 'ఫౌజీ' - సీక్వెల్ కాదు ప్రీక్వెల్... అసలు రీజన్ ఏంటంటే?

'వారణాసి' మూవీలో ప్రియాంక చోప్రానే హీరోయిన్ అని కన్ఫర్మ్ చేశారు నిర్మాత. ఆమె 'మందాకిని' పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఓ గుహలో దేవతా విగ్రహాల మధ్యలో ప్రియాంక చీర కట్టుకుని గన్ పట్టుకుని మాస్ లుక్‌లో కనిపించండ హైలెట్‌గా నిలిచింది. ఇక టీజర్‌లో వనాంచల్ ఉగ్రభట్టి గుహలో చిన మస్తానా దేవి టెంపుల్‌లో ప్రియాంక పైన ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో రాజమౌళి ఆమెను ఎలా చూపించబోతున్నారు? అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

తాంత్రిక పూజల్లో ఆరాధించే రౌద్ర రూప దేవతల్లో చిన మస్తా దేవి కూడా ఉంది. ముఖ్యంగా టిబెటిన్ తాంత్రిక ఆరాధనల్లో ఈ దేవి పూజ ఉంటుంది. ఈమెకు చిన్న మస్తా, ప్రచండ చండిక, జోగని మా వంటి పేర్లు కూడా ఉన్నాయి. ఉగ్రభట్టి గుహలో ఆ దేవి విగ్రహంపై నుంచి పడుతున్న ప్రియాంక చోప్రా వంటి అమ్మాయిని హీరో కాపాడుతున్నట్లుగా టీజర్లో చూపించారు.