Ravi Teja's Mass Jathara Faces Massive OTT Roadblocks : మాస్ మహారాజ రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల రీసెంట్ మాస్ ఎంటర్టైనర్ 'మాస్ జాతర' అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. అయితే, ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కూడా ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Continues below advertisement

ఓటీటీ డీల్‌పై...

'మాస్ జాతర' మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' రిలీజ్‌కు ముందే సొంతం చేసుకుంది. మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడంతో ఇప్పుడు ఆ డీల్ నుంచి సదరు ఓటీటీ సంస్థ వైదొలగిందనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఊహించిన దాని కంటే తక్కువ ధరకే డీల్ ముగించేలా మూవీ టీం ప్లాన్ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. దీని కోసం 'నెట్ ఫ్లిక్స్'తో సంప్రదింపులు జరుపుతోందట. అయితే, దీనిపై ఇప్పటివరకూ చిత్ర నిర్మాణ సంస్థ ఎలాంటి అనౌన్స్‌మెంట్ చేయలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

Continues below advertisement

Also Read : మరో వివాదంలో రాజమౌళి - ఫిలిం చాంబర్‌కు 'వారణాసి' టైటిల్ పంచాయితీ... జక్కన్న ముందున్న ఆప్షన్స్ ఏంటి?

మూవీలో రవితేజ, శ్రీలీలతో పాటు నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, వీటీవీ గణేష్, హైపర్ ఆది, అజయ్ ఘోష్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు.

స్టోరీ ఏంటంటే?

నిజాయతీ గల రైల్వే ఎస్సై లక్ష్మణ్ భేరీ (రవితేజ) తన కళ్ల ముందు ఏదైనా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోడు. తనకు సంబంధం లేకున్నా తన ఆధీనంలోకి తెచ్చుకుని మరీ విచారిస్తాడు. అలా మినిస్టర్ కొడుకుతో పంచాయితీ కారణంగా అల్లూరి జిల్లా అడవివరానికి ట్రాన్స్‌ఫర్ అవుతాడు. అక్కడ రైతులతో గంజాయి పండించి కలకత్తాకు స్మగ్లింగ్ చేయాలని చూస్తాడు శివుడు (నవీన్ చంద్ర). ఈ విషయం తెలుసుకున్న లక్ష్మణ్ ఏం చేశాడు? తులసి (శ్రీలీల)తో లక్ష్మణ్ ప్రేమాయణం ఎలా సాగింది? తులసి అక్కకు శివుడికి సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.