Junior NTR Gets Injury In Add Shooting: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప గాయమైంది. హైదరాబాద్‌లో ఓ యాడ్ షూట్‌లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న టైంలో ఆయన కింద పడడంతో కాలికి గాయమైంది. వెంటనే అలర్ట్ అయిన వ్యక్తిగత సిబ్బంది ఆయన్ను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
టీం అనౌన్స్‌మెంట్
ఈ ప్రమాదంపై ఎన్టీఆర్ టీం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది. ఆయనకు స్వల్ప గాయమే అయ్యిందని ఫ్యాన్స్ ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేసింది. వైద్యుల సలహా మేరకు ఎన్టీఆర్ 2 వారాల విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిపింది. 'ఎన్టీఆర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. రెండు వారాల పాటు విశ్రాంతి అవసరం. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. ఆయన ఆరోగ్యంపై వస్తోన్న ఊహాగానాలు ఎవరూ నమ్మొద్దు.' అంటూ వెల్లడించింది. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
రీసెంట్‌గా 'వార్ 2'తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' మూవీతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఆయన స్వాతంత్ర్య సమర యోధుడిగా కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా... మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 25న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.