విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు నందమూరి తారక రామారావు జయంతి నేపథ్యంలో రాజకీయ, సినీ ప్రముఖులకు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. సోషల్ మీడియా వేదికగా పలువురు ఆయన్ని స్మరించుకున్నారు. నటుడిగా తెలుగు సినీ పరిశ్రమకు, రాజకీవేత్తగా తెలుగు ప్రజలకు చేసిన మేలు మరవలేనిదంటూ ఎన్టీఆర్‌ సేవలను కొనియాడారు. 


శనివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్‌లు నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా సీనియర్ ఎన్టీఆర్‌ను తలచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగపు ట్వీట్ చేశారు. ‘‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా’’ అని పేర్కొన్నారు. తారక్‌తోపాటు చిరంజీవి, రామ్ చరణ్ తదితర సెలబ్రిటీలు సైతం ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పించారు. 


ఎన్టీఆర్ ట్వీట్:






మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. ‘‘తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు, నవరస నటనా సార్వభౌముడు, తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి  కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి’’ అని పేర్కొన్నారు. 






రామ్ చరణ్ ట్వీట్:





మంచు విష్ణు: