మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా (NTR 30 Movie) రూపొందుతోంది. కొన్ని రోజులుగా హైదరాబాదులో చిత్రీకరణ చేస్తున్నారు. నిన్నటితో అది ముగిసింది. ఆ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ట్వీట్ చేశారు. అయితే, అందులో ఓ మాట ఎన్టీఆర్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది. అది ఏమిటంటే?
పవర్ ఫుల్ యాక్షన్!
ఎన్టీఆర్ అంటే యాక్షన్! సాధారణ యాక్షన్ సన్నివేశాన్ని సైతం తన నటనతో నెక్స్ట్ లెవల్‌కు తీసుకు వెళతారు. ఇక, పవర్ ఫుల్ యాక్షన్ సీన్ అయితే ఆయన చెలరేగిపోతారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం'లో ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సన్నివేశాన్ని అంత త్వరగా ఎవరు మర్చిపోతారు చెప్పండి! అసలే ఎన్టీఆర్ 30 టీజర్ అంచనాలు పెంచింది. అందులో డైలాగులు హైప్ పెంచాయి.
''పవర్ ఫుల్ యాక్షన్ తో సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేశాం. బ్రదర్ ఎన్టీఆర్ స్టైల్ అండ్ యాక్షన్ అద్భుతం'' అని రత్నవేలు పేర్కొన్నారు. దాంతో యుంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అదీ సంగతి!
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఎన్టీఆర్, ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా... రెండో షెడ్యూల్ చేశారు.
Also Read : మూడు వారాలకే ఓటీటీలో 'ఏజెంట్' - సోనీ లివ్‌లో ఆ రోజు రిలీజ్ పక్కా!
ఎన్టీఆర్ 30లో సీరియల్ స్టార్ చైత్ర రాయ్!
Chaithara Rai In NTR 30 : ఇన్నాళ్లూ బుల్లితెరపై 'అష్టా చమ్మా', 'దటీజ్ మహాలక్ష్మి', 'అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు' సీరియళ్లతో సందడి చేసిన చైత్ర రాయ్, ఇప్పుడు వెండితెర అవకాశాన్ని అందుకున్నారు. అదీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమాలో నటించే అవకాశం సొంతం చేసుకున్నారు.
Chaithra Rai plays Saif Ali Khan Wife : ప్రస్తుతం 'జీ తెలుగు'లో ప్రసారం అవుతున్న 'రాధకు నీవేరా ప్రాణం'లో నటిస్తున్న చైత్ర రాయ్... ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో సైఫ్ అలీ ఖాన్ భార్య పాత్ర పోషించే అవకాశం అందుకున్నారు. సెకండ్ షెడ్యూల్ షూటింగులో ఆమె కూడా పాల్గొన్నారు.
''ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్... ఇద్దరూ పెద్ద స్టార్లు! వాళ్ళను సిల్వర్ స్క్రీన్ మీద చూడటమే కానీ నేరుగా కలిసింది లేదు. తొలిసారి వాళ్ళను చూడగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇద్దరు గొప్ప స్టార్లతో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. నాకు ఇదొక వరం'' అని చైత్ర రాయ్ పేర్కొన్నారు.
Also Read : నేను ఆత్మహత్య చేసుకుంటే కారణం వీళ్ళే, నన్ను చంపేందుకూ ప్రయత్నించారు - లిరిసిస్ట్ శ్రేష్ఠ షాకింగ్ పోస్ట్
ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎన్టీఆర్ జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు.