ఒక సినిమా క్రియేట్ చేసిన రికార్డులను మరో సినిమా తిరగరాసుకుంటూ వెళ్లడమే సినీ పరిశ్రమను ముందుకు తీసుకువెళ్లేలా చేస్తుంది. దాని వల్లే హీరోల మధ్య కూడా ఎప్పుడూ పోటీ నడుస్తోంది. అలా ఒకరికి మించి ఒకరు బెటర్ సినిమాలు చేయాలి అనే ఆలోచన వస్తుంది. తాజాగా ‘జవాన్’ సినిమా కూడా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసిన ఎన్నో సినిమాలకు పోటీగా నిలుస్తోంది. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ చిత్రం ఇటీవల విడుదలయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అయితే కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డ్స్ సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ ఎంతంటే..


సౌత్ డైరెక్టర్లతో కలిసి పనిచేసిన అనుభవం ఎక్కువగా షారుఖ్ ఖాన్‌కు లేదు. కానీ అట్లీ లాంటి యంగ్ డైరెక్టర్ చెప్పిన కథను నమ్మి తనతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు ఈ బాలీవుడ్ బాద్‌షా. ఈ మూవీలో షారుఖ్.. ఎన్నో షేడ్స్‌లో కనిపించాడు. సెప్టెంబర్ 7న ‘జవాన్’ విడుదలై మొదటిరోజే హిట్ టాక్ అందుకోవడంతో ఫస్ట్ వీకెండ్‌కు ఈ మూవీ చూడాలనుకునేవారి సంఖ్య మరింత పెరిగిపోయింది. ఇప్పటికే మూవీ విడుదలై నాలుగు రోజులే అయినా ప్రపంచవ్యాప్తంగా రూ.520 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. సరిగ్గా కథ రాసుకొని, దానికి షారుఖ్ లాంటి స్టార్ హీరోను సెట్ చేసుకుంటే.. ఒక సినిమా ఎన్ని వండర్స్ క్రియేట్ చేయగలదో ‘జవాన్’తో ప్రూవ్ చేశాడు అట్లీ. అయితే ఇండియాలో షారుఖ్‌కు ఉన్న క్రేజ్ కారణంగా ‘జవాన్’కు ఈ రేంజ్‌లో కలెక్షన్స్ వస్తున్నాయని అనుకున్నా.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా ఈ మూవీ కాసుల వర్షం కురిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.


‘నన్ 2’ను వెనక్కి నెట్టేసి..


న్యూజిలాండ్‌లో వీకెండ్‌లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్ట్‌లో ఇప్పటికే షారుఖ్ నటించిన ‘జవాన్’.. మొదటి స్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్‌లో ‘జవాన్’కు పోటీగా విడుదలైన ‘నన్ 2’ను కూడా వెనక్కి నెట్టేసి షారుఖ్ సినిమా టాప్ 1 స్థానాన్ని సాధించడం గమనార్హం. ఇక ఆస్ట్రేలియాలో కూడా వీకెండ్ కలెక్షన్స్ విషయంలో ‘జవాన్’ రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. ‘నన్ 2’ లాంటి ఒక ఇంగ్లీష్ హారర్ సినిమాతో పోటీగా బాక్సాఫీస్ రంగంలోకి దిగిన ‘జవాన్’.. కలెక్షన్స్ విషయంలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 


భారీ కాస్టింగ్‌తో..


అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్’లో షారుఖ్‌కు జోడీగా నయనతార నటించింది. ఎన్నో ఏళ్లుగా సౌత్‌లో అనేక సినిమాలు చేసి లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతారకు బీ టౌన్‌లో ఈ మూవీ గ్రాండ్ డెబ్యూనే ఇచ్చింది. ఇక షారుఖ్ లాంటి బలమైన హీరోతో పోటీపడే చురుకైన విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. ‘జవాన్’లో షారుఖ్ చేసిన పాత్రకు ఎన్ని ప్రశంసలు అందుతున్నాయో.. విజయ్ సేతుపతి చేసిన పాత్రకు కూడా అన్ని ప్రశంసలు వస్తున్నాయి. నయనతారతో పాటు మరో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కూడా ఇందులో కీలక పాత్రలో నటించింది. ప్రియమణి, సాన్య మల్హోత్రా లాంటి బ్యూటీలు కూడా ‘జవాన్’లో కాసేపు కీ రోల్స్ ప్లే చేశారు.


Also Read: సౌత్ లో ఆ హీరోతో మాత్రం చేయదట- అతిలోక సుందరి కూతురు వింత నిర్ణయం!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial