తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'(Kannappa) కోసం మంచు విష్ణు స్టార్ కాస్ట్ ని రంగంలోకి దింపుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ప్రాజెక్టు కోసం కేవలం నటీనటులే కాకుండా అగ్ర సాంకేతిక నిపుణులను తీసుకుంటున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ బయటకొచ్చింది. 'కన్నప్ప' కోసం 'బాహుబలి', 'జవాన్' వంటి పాన్ ఇండియా సినిమాలకు పనిచేసిన ప్రముఖ అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ ని మంచి విష్ణు రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆయన ఎవరు? డీటెయిల్స్ లోకి వెళ్తే.. మంచి విష్ణు 'కన్నప్ప' ప్రాజెక్ట్ ని ప్రకటించినప్పటి నుండి రోజురోజుకీ ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు పెరుగుతున్నాయి.


ఇప్పటికే ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ వంటి భారీ తారాగణం భాగమవడంతో ఆడియన్స్​లోనూ క్యూరియాసిటీ ఏర్పడింది. అలాంటి ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా ఇంటర్నేషనల్ యాక్షన్ కొరియోగ్రాఫర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. 'బాహుబలి', 'జవాన్', 'పొన్నియన్ సెల్వన్' వంటి భారీ పాన్ ఇండియా సినిమాలకు ఫైట్స్ కంపోస్ట్ చేసిన ఇంటర్నేషనల్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా 'కన్నప్ప' మూవీ కోసం పనిచేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే యాక్షన్ కొరియోగ్రాఫర్​గా ఆయన కంపోజ్ చేసిన పోరాట సన్నివేశాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.


ఇక కన్నప్ప కోసం ఆయన చేయబోయే యాక్షన్ సీక్వెన్స్​లు ఆడియన్స్​ని సీట్ ఎడ్జ్​లో కూర్చోబెడతాయని మేకర్స్ నమ్ముతున్నారు. మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇంటర్నేషనల్ లెవెల్​లోనే ఈ సినిమాని రూపొందిస్తున్నారు. అంతేకాకుండా ప్రాచీన యుద్ధాలను మళ్లీ ఈ సినిమాతో తెరపైకి తీసుకురాబోతున్నారు. ఆ నాటి కాలంలో వాడిన ఆయుధాలు, అప్పుడు జరిగిన పోరాటాలు, భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఆడియన్స్ ని థ్రిల్ చేసే యాక్షన్స్ సన్నివేశాలెన్నో ఈ సినిమాలో ఉండబోతున్నాయి. వాటిని ఇంటర్నేషనల్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా నెక్స్ట్ లెవెల్ లో కంపోజ్ చేయబోతున్నారని తెలుస్తోంది.


ఇక తాజాగా ఆయన రాకతో కన్నప్ప మరో స్థాయికి చేరుకుంది. కన్నప్ప మూవీని చూసిన ఆడియన్స్ కచ్చితంగా ఓ సరికొత్త అనుభూతిని పొందుతారు అంటూ మూవీ టీం తెలిపింది. ఇప్పటికే కన్నప్ప కోసం యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా థాయిలాండ్, హాంకాంగ్ వంటి దేశాల నుంచి 80 మంది ఫైటర్లను సెట్స్ మీదికి తీసుకొచ్చినట్లు సమాచారం. వారందరితో కంపోజ్ చేసే యాక్షన్ సీక్వెన్స్ లు నెక్స్ట్ లెవెల్​లో ఉండబోతున్నాయి. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు ఆడియన్స్ ని థ్రిల్ చేయడం గ్యారెంటీ అని తెలుస్తోంది. రీసెంట్ గా షారుక్ నటించిన 'జవాన్' లో ఆయన కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలకు భారీ గుర్తింపు లభించింది. ఇక ఇప్పుడు 'కన్నప్ప' కోసం కేచాని మంచు విష్ణు రంగంలోకి దింపడంతో ఒక్కసారిగా ఈ ప్రాజెక్టుపై అంచనాలు రెట్టింపు అయ్యాయనే చెప్పాలి.


Also Read : బాలీవుడ్ యాక్టర్స్ బాలయ్యను చూసి నేర్చుకోవాలి - పాయల్ ఘోష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial