Javed Akhtar Shocking Comments On Animal Success: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన 'యానిమల్' మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ ని అందుకుందో తెలిసిందే. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ తండ్రి పాత్రలో, బాబీ డియోల్ విలన్ రోల్ లో కనిపించిన ఈ సినిమా డిసెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.900 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని రణ్ బీర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతోపాటు ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకున్నప్పటికీ 'యానిమల్' పై విమర్శలు ఏమాత్రం తగ్గలేదు.


ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాపై ఎన్నో నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. ముఖ్యంగా సినిమాలో విపరీతమైన వైలెన్స్ ఉందని దాంతోపాటు సినిమాలో పురుష అహంకారాన్ని కూడా ఎక్కువగా చూపించారంటూ విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్ సైతం 'యానిమల్' పై ఘాటుగా స్పందించారు. ఇలాంటి సినిమాల విజయం మంచిది కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఔరంగాబాద్ లో జరిగిన అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న ఆయన ప్రస్తుత సినిమా పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేశారు.


ఈ క్రమంలోనే యానిమల్ సినిమా ప్రస్తావనని ఇన్ డైరెక్ట్ గా తీసుకొస్తూ.." సమాజం మెచ్చుకునే ఎలాంటి పాత్రలను సృష్టించాలనుకుంటున్నారో ఈరోజు యువ నిర్మాతలకు ఇది పరీక్షా సమయం అని నేను నమ్ముతున్నాను. ఒక సినిమాలో ఒక పురుషుడు స్త్రీ ని తన షూ నాకమని అడిగాడు. అలాగే ఆ స్త్రీని చెంప దెబ్బ కొట్టడం.. ఇలాంటి సన్నివేశాలు ఉన్న సినిమా సూపర్ హిట్ అయితే సమాజానికే చాలా ప్రమాదకరం" అని అన్నారు.


" ఈరోజుల్లో నిర్మాతల కంటే ప్రేక్షకులపై పెద్ద బాధ్యత ఉందని నేను భావిస్తున్నా. ఎలాంటి సినిమాలు తీయాలి? ఎలాంటి సినిమాలు తీయకూడదు? అనేది ప్రేక్షకులే డిసైడ్ చేయాలి. అలాగే మన సినిమాల్లో ఎలాంటి విలువలు, నైతికత చూపించాలి, దేనిని తిరస్కరించాలి అన్న నిర్ణయం కూడా మీ చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం బంతి ప్రేక్షకుల కోర్టులో ఉంది. ఈరోజు రచయితలు తెరపై ఎలాంటి హీరోని ప్రదర్శించాలనే పెద్ద సవాలును ఎదుర్కొంటున్నారు. సమాజంలోనే ఈ గందరగోళం ఉంది. సమాజం ఏది ఒప్పు, ఏది తప్పు అనేదానిపై స్పష్టంగా ఉన్నప్పుడు కథలో గొప్ప పాత్రలను సృష్టించవచ్చు. కానీ సమాజం అలా లేనప్పుడు మనం గొప్ప పాత్రను సృష్టించలేము" అని చెప్పుకొచ్చారు జావేద్ అక్తర్. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ గా మారాయి. మరి దీనిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


Also read : మరో డెబ్యూ డైరెక్టర్​కి నాగార్జున గ్రీన్ సిగ్నల్ - కొత్త సినిమాపై ఆసక్తికర అప్డేట్!