Jani Master Bail: లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కు ఊరట... బెయిల్ మంజూరు చేసిన కోర్టు

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కాస్త ఊరట లభించింది. ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అందుగల కారణం ఏమిటి? అని చూస్తే...

Continues below advertisement

ప్రముఖ కొరియోగ్రాఫర్, తెలుగు టీవీ అండ్ సినిమా డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానీ మాస్టర్ (Jani Master) కొన్ని రోజుల క్రితం కటకటాల పాలు అయిన సంగతి తెలిసిందే.‌ ఆయన దగ్గర సహాయకురాలిగ పని చేసిన ఒక మహిళా కొరియోగ్రాఫర్ పెట్టిన కేసు నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల కేసుతో పాటు ఫోక్సో చట్టం కింద జానీ మాస్టర్ మీద అభియోగాలు నమోదు అయ్యాయి. అయితే... ఈ కేసులో ఆయనకు కాస్త ఊరట లభించింది.

Continues below advertisement

జానీకి బెయిల్ మంజూరు చేసిన కోర్టు!
అక్టోబర్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జానీ మాస్టర్ (Jani Master Bail)కి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి కారణం ఆయనకు నేషనల్ అవార్డు రావడం!

ధనుష్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'తిరు చిత్రాంబళం' సినిమాలో 'మేఘం కరుక్కత' పాటకు గాను జానీ మాస్టర్ (National award for Jani Master) నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఉత్తమ నృత్య దర్శకుడిగా ఆయనకు పురస్కారం వచ్చిన విషయాన్ని కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఆ తర్వాత జానీ మీద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కంప్లైంట్ ఇవ్వడం, లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం, పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడం వంటివి జరిగాయి. నేషనల్ అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లాలని జానీ మాస్టర్ కోర్టుకు విన్నవించుకున్నారు. ఆయన మీద నమోదు అయిన అభియోగాలు నిరూపితం కానందున ఆయనకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు‌.

Also Read: దేవర సక్సెస్ మీట్ క్యాన్సిల్ చేయడానికి కారణాలు... అసలు విషయం చెప్పిన నాగవంశీ

తెలుగు చిత్రసీమ పెద్దలను కలుస్తున్న జానీ భార్య!
ఉద్దేశపూర్వకంగా తన భర్త జానీ మాస్టర్ మీద లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసిందని ఆయన భార్య అలీషా అలియాస్ సుమలత చెబుతున్నారు.‌ ఈ విషయంలో తమకు న్యాయం చేయవలసిందిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలను ఆవిడ కలుస్తున్నట్లు తెలిసింది.

Also Readఆడపిల్లలు అంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?

జానీ మాస్టర్ తప్పు చేయలేదని, తప్పుడు ఉద్దేశాలతో ఆయనను ఈ కేసులో ఇరికించారని ఇండస్ట్రీలో కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు.‌ జానీ మాస్టర్ దగ్గర ఏడాది క్రితమే కంప్లైంట్ చేసిన లేడీ కొరియోగ్రాఫర్ వర్క్ చేయడం మానేసిందని, ఆమె సొంతంగా పాటలకు కొరియోగ్రఫీ చేస్తుందని, ఇప్పుడు జానీ మాస్టర్ తనను బెదిరిస్తున్నారని, తనకు అవకాశాలు రాకుండా చేస్తున్నారని కంప్లైంట్ ఇవ్వడంలో అసలు అర్థమే లేదని ఇండస్ట్రీలో కొందరు ఆఫ్ ది రికార్డ్ కామెంట్ చేస్తున్నారు. సి కళ్యాణ్ వంటి నిర్మాతల సైతం జానికి అండగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ కేసు ఎటు వెళుతుందో చూడాలి.

Continues below advertisement