Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్.. తన షూటింగ్స్ నుండి కాస్త విరామం దొరికిన ప్రతీసారి ఏదో ఒక చోటుకి వెళ్తూ ఉంటుంది. ఎక్కువగా ఫారిన్ ట్రిప్స్‌పైనే జాన్వీ ఫోకస్ పెడుతుంది. వెకేషన్స్ అంటే జాన్వీకి చాలా ఇష్టమని తన సోషల్ మీడియా చూస్తే అర్థమవుతుంది. అయితే ఎప్పుడూ ఫ్రెండ్స్‌తో వెకేషన్స్‌కు మాత్రమే కాకుండా దేవాలయాలకు వెళ్లడం కూడా ఈ ముద్దుగుమ్మకు చాలా ఇష్టం. ప్రస్తుతం చెన్నైలో ఉన్న జాన్వీ కపూర్.. తన తల్లికి ఇష్టమైన దేవాలయాన్ని దర్శించుకుంది. అక్కడ ఫోటో దిగి తన సోషల్ మీడియాలో కూడా షేర్ కూడా చేసింది.


మొదటిసారిగా..


చెన్నైలోని ముప్పతమ్మన్ దేవాయలం అంటే శ్రీదేవికి చాలా ఇష్టమని బయటపెట్టింది జాన్వీ కపూర్. ఆ దేవాలయాన్ని తన పిన్ని మహేశ్వరితో కలిసి దర్శించుకుంది. గుడి దగ్గర తనతో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘మొదటిసారిగా ముప్పతమ్మన్ దేవాలయాన్ని దర్శించుకున్నాను. చెన్నైలో ఇదే అమ్మకు ఫేవరెట్ ప్లేస్’ అని తెలిపింది జాన్వీ. ప్రస్తుతం జాన్వీ కపూర్ చెన్నైలో ఉంది. ఐపీఎల్ ఫైనల్స్‌లో కేకేఆర్ (కోలకత్తా నైట్ రైడర్స్)ను సపోర్ట్ చేయడానికి చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు స్టేడియంకు వెళ్లారు. అందులో జాన్వీ కపూర్ కూడా ఒకరు.






వినూత్నంగా ప్రమోషన్స్..


జాన్వీ కపూర్.. తన అప్‌కమింగ్ మూవీ ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ ప్రమోషన్స్‌లో భాగంగా గత కొన్నాళ్లుగా ప్రతీ ఐపీఎల్ మ్యాచ్‌ను నేరుగా చూడడానికి స్టేడియంకు వెళ్తుంది. ఇది క్రికెట్‌కు సంబంధించిన సినిమా కావడంతో, ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ రన్ అవుతుండడంతో ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ కోసం స్టేడియం నుండే ప్రమోషన్స్ చేస్తున్నారు రాజ్‌కుమార్ రావు, జాన్వీ కపూర్. అంతే కాకుండా ఈ ప్రమోషన్స్‌లో జాన్వీ ఏం చేసినా హైలెట్ అవుతుంది. ప్రమోషన్స్ కోసం తను ఎంచుకుంటున్న ఔట్‌ఫిట్స్ కూడా ఎక్స్‌క్లూజివ్‌గా క్రికెట్‌ను సపోర్ట్ చేసేలా ఉంటున్నాయి. దీంతో నెటిజన్లు తన కలెక్షన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు.


క్రికెట్‌లో ట్రైనింగ్..


‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’లో జాన్వీ కపూర్ ఒక క్రికెటర్‌గా కనిపించనుంది. దీనికోసం తను 150 రోజుల పాటు క్రికెట్‌లో ట్రైనింగ్ కూడా తీసుకుంది. రాజ్‌కుమార్ రావు, జాన్వీ జంటగా నటిస్తున్న ఈ సినిమాను షరన్ శర్మ డైరెక్ట్ చేశారు. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్‌తో పాటు జీ స్టూడియోస్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ నుండి విడుదలయిన ప్రతీ అప్డేట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పాటలు కూడా మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. మే 31న ఈ సినిమా థియేటర్లకు రావడానికి సిద్ధమవుతుండగా తన తల్లి ఫేవరెట్ గుడికి వెళ్లి దర్శనం చేసుకుంది జాన్వీ కపూర్.


Also Read: ఫిట్నెస్ ట్రైనర్తో కాఫీ డేట్‌కి పాండ్యా భార్య నటాషా- మళ్లీ ప్రేమ చిగురించిందా ?