Janhvi Kapoor Peddi

Continues below advertisement

జాన్వికపూర్ కి టైమ్ కలసిరావడం లేదా? 

వరుస ఆఫర్లొస్తున్నా కెరీర్ మలుపు తిప్పే హిట్ ఎందుకురావడం లేదు..

Continues below advertisement

ధడక్ నుంచి పరమ్ సుందరి వరకూ జాన్వి లక్ మార్చే మూవీనే లేదా?

జాన్వి కపూర్ ఆశలన్నీ ఇప్పుడు 'పెద్ది' పైనే ఉన్నాయా?

ధడక్ (2018)

జాన్వీ కపూర్ మొదటి సినిమా ధడక్  మరాఠీ మూవీ సైరత్ రీమేక్. బాక్సాఫీస వద్ద యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఫ్లాప్ కాదు అలాగని హిట్ కూడా కాదు గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ (2020)ఈ బయోపిక్‌లో జాన్వి నటనకు విమర్శల నుంచి ప్రశంసలు అందాయ్ కానీ కలిసొచ్చేందేమీ లేదు. ఈ మూవీ ఓటీటీలో విడుదల కావడంతో ఫలితాలు అంచనావేయలేం రూహీ (2021)

రాజ్‌కుమార్ రావ్‌తో కలిసి నటించిన ఈ హారర్-కామెడీ మూవీని ఫ్లాప్ అనే ప్రచారం జరిగినప్పటికీ నిర్మాణ వ్యయం మాత్రం వచ్చేసింది మిలీ (2022) 

ఈ సర్వైవల్ థ్రిల్లర్‌లో జాన్వీ నటనకు మంచి మార్కులే పడినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. బవాఫా (2023)

వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన ఈ రొమాంటిక్ కామెడీ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు దేవర (2024)

జాన్వికపూర్ తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ ఇది. సినిమా రిజల్ట్ బావున్నప్పటికీ జాన్వికి పెద్దగా ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ లేకపోవడంతో తేలిపోయింది. దేవర జాన్వికి ఎలాంటి గుర్తింపు తెచ్చిపెట్టలేదు పరమ్ సుందరి (2025)

సిద్ధార్థ్ మల్హోత్రాతో నటించిన ఈ రొమాంటిక్ కామెడీ కూడా జాన్వి అకౌంట్లో మరో ఫ్లాప్ గా మిగిలింది . ఈ సినిమాపై చాలా బజ్ ఏర్పడింది.  బాగా ప్రమోట్ చేశారు కూడా . కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ ఖాతాలో ఇప్పటికే చాలా ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మరోటి కూడా చేరినట్టైంది.  'పరమ్ సుందరి'ని తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రెండు రాష్ట్రాల కథను చూపించారు. 'పరమ్ సుందరి' విడుదలయ్యే ముందు, ఈ సంవత్సరం ఉత్తమ రొమాంటిక్ కామెడీగా భావించారు, కానీ దీనికి విరుద్ధంగా జరిగింది.  కోయి మోయి నివేదిక ప్రకారం, ఈ సినిమా 60 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు.  ఇప్పటివరకు 50 కోట్ల మార్కును కూడా దాటలేదు. సినిమా వసూళ్లు ఇప్పుడు లక్షల్లోకి పడిపోయాయి. సినిమా పదమూడో రోజు కలెక్షన్లు  చాలా తక్కువగా ఉంది. రాబోయే రోజుల్లో థియేటర్లలో చాలా పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి..ఈ ప్రభావం  'పరమ్ సుందరి' పై ఉండటం ఖాయం.  ఇక సక్నిల్క్ నివేదిక ప్రకారం, 'పరమ్ సుందరి' 13వ రోజున 30 లక్షల వసూళ్లు సాధించింది. దీని తర్వాత మొత్తం కలెక్షన్లు 47.68 కోట్లకు చేరుకున్నాయి. 

ఆశలన్నీ రామ్ చరణ్ 'పెద్ది' పైనే

ప్రస్తుతం జాన్వికపూర్ ఆశలన్నీ రామ్ చరణ్  - బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్దిపైనే ఉన్నాయ్. ఈ మూవీ సక్సెస్ అయితే జాన్వి ఖాతాలో ఫస్ట్ బెస్ట్ హిట్ పడినట్టవుతుంది. మరి జాన్వి అదృష్టాన్ని చరణ్ మారుస్తాడేమో వెయిట్ అండ్ సీ..

OTTలో ఎప్పుడు విడుదలవుతుంది

'పరమ్ సుందరి' ఇప్పుడు OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదల కోసం ఎదురు చూస్తున్నారు .  అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతుంది.