Janasena MLA Bolisetty Srinivas On Allu Arjun: అల్లు అర్జున్ తన స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి స్పందించారు. అల్లు అర్జున్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన కూల్ గా రియాక్ట్ అయ్యారు. అల్లు అర్జున్ కు తనకు, తన పార్టీకి ఎలాంటి శత్రుత్వం లేదన్నారు. “అల్లు అర్జున్ వివాదంపై నేను మళ్లీ మాట్లాడాలి అనుకోవడం లేదు. నిన్న అడిగారు సమాధానం చెప్పాను. అక్కడితో అయిపోయింది. అతడికి నాకు, అతడికి మా పార్టీకి ఎలాంటి శత్రుత్వం లేదు. వాళ్లు ఏదైనా మాట్లాడినప్పుడు మనం మాట్లాడితే బాగుంటుంది. ఊరికే మాట్లాడ్డం మంచిది కాదు. అంతకు ముందు ఆయన మాట్లాడాడు. నిన్న నేను మాట్లాడాను. అక్కడితో అయిపోయింది” అని చెప్పుకొచ్చారు.
ఇంతకీ వివాదం ఎక్కడ మొదలైందంటే?
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య వివాదానికి కారణం అయ్యాయి. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి గెలుపు కోసం బన్నీ ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో బన్నీ మీద నాగ బాబు విమర్శలు చేశారు. ఆ తర్వాత కొణిదెల, అల్లు అభిమానుల మధ్య వార్ మొదలయ్యింది. కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం హోదాలో కర్నాటకలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ అల్లు అర్జున్ ను పరోక్షంగా టార్గెట్ చేశారు. ఒప్పుడు హీరోగా అడవులను కాపాడే వారని, ఇప్పుడు స్మగ్లర్లుగా మారారని కామెంట్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాను దృష్టిలో పెట్టుకుని చేశారనే చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా ఓ సినీ వేడుకలో పాల్గొన్న అల్లు అర్జున్ పరోక్షంగా నంద్యాల విషయాన్ని ప్రస్తావించారు. తనను నమ్మిన వాళ్ల కోసం ఎక్కడికైనా వెళ్తానంటూ కామెంట్ చేశాడు. పనిలో పనిగా “నాకు ఇష్టమైతే వస్తా.. నా మనసుకు నచ్చితే వస్తా” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి అన్నారనే చర్చ జరిగింది.
అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు
అల్లు అర్జున్ వ్యాఖ్యలపై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. అల్లు అర్జున్ తన స్థాయేంటో తెలుసుకుని మాట్లాడిత మంచిదన్నారు. అసలు అల్లు అర్జున్ కు అభిమానులు ఉన్నారనే విషయమే తనకు తెలియదన్నారు. చిరంజీవికి, ఇంకా చెప్పాలంటే మెగా ఫ్యాన్స్ మాత్రమే ఉన్నారని చెప్పారు. మెగా ఫ్యామిలీ నుంచి విడిపోయి ఎవరైనా బ్రాంచులు పెట్టుకున్నారేమో తనకు తెలియదన్నారు. అల్లు అర్జున్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. అంతేకాదు, జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించిందన్నారు. అల్లు అర్జున్ ప్రచారం చేసిన నందాలలోనూ వైసీపీ ఓడిపోయిందన్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ అభిమానులు అల్లు అర్జున్ ను తమ హీరోగా భావిస్తున్నారని చెప్పారు. నువ్వు వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? అంటూ ఘాటుగా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మరోసారి రచ్చ మొదలయ్యింది. అల్లు, కొణిదెల అభిమానుల మధ్య వార్ కొనసాగుతోంది.
Read Also: అల్లు అర్జున్ నువ్వేమైనా పుడింగా, మెగా ఫ్యాన్స్ ఇక్కడ - జనసేన ఎమ్మెల్యే ఫైర్