James Camron Avatar Fire And Yash Movie Piracy : సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కామెరూన్ 'అవతార్'. ఈ ఫ్రాంచైజీలో మూడో మూవీ 'అవతార్ 3' (ఫైర్ అండ్ యాష్) శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, రిలీజ్‌కు ముందే పైరసీ ప్రింట్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఆన్‌లైన్‌లో 'అవతార్ 3' పైరసీ
సాధారణంగా ఏ మూవీ అయినా రిలీజ్ అయిన తర్వాత పైరసీ చేయడం మనం చూస్తుంటాం. కానీ 'అవతార్ ఫైర్ అండ్ యాష్' మూవీ పైరసీ ప్రింట్ మాత్రం రిలీజ్‌కు ఒక రోజు ముందే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయ్యింది. ఇప్పటికే ఓవర్సీస్‌లో ఈ మూవీ స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. అక్కడ ప్రీమియర్స్ పడిన కొద్దిసేపటికే నెట్టింట ఈ లింక్స్ ప్రత్యక్షం కావడంతో మూవీ లవర్స్ ఆందోళన చెందుతున్నారు. హై క్వాలిటీ HD ప్రింటే అందుబాటులో ఉందని... మూవీ టీం ఆ లింక్స్ తొలిగించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
రీసెంట్‌గానే 'iBOMMA' రవి అరెస్టుతో పైరసీకి కొంతమేర చెక్ పెట్టినట్లయిందని అంతా భావించారు. అయితే, కేవలం 'iBOMMA' మాత్రమే కాకుండా 'movie rulz', 'Tamilmv' ఇలా ఇతర వెబ్ సైట్స్‌లోనూ కొత్త మూవీస్ పూర్తి క్వాలిటీతో పైరసీ చేస్తున్నారని... ఈ వెబ్ సైట్స్‌పైనా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Also Read : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
'అవతార్' సిల్వర్ స్క్రీన్‌పై ఓ అద్భుతాన్నే ఆవిష్కరించారు జేమ్స్ కామెరూన్. ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ఫస్ట్ రెండు పార్టులు ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించాయి. 'పండోర' అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులో నేచర్ బ్యూటీని అద్భుతంగా ఆడియన్స్ కళ్లకు కట్టేలా చూపించారు. దీనికి సీక్వెల్‌గా వచ్చిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఫస్ట్ రెండు పార్టులు భూమి, నీరుకు సంబంధించినవి కాగా... మూడో పార్టులో అగ్నిని చూపించనున్నట్లు తెలుస్తోంది. జేక్, నెయిత్రి, కిరి సహా భూమి మీద నుంచి అక్కడకు వెళ్లిన కల్నల్‌తో పాటు మరో రోల్‌ను ఇందులో ఇంట్రడ్యూస్ చేయనున్నారు. శుక్రవారం ఈ అద్భుతం ప్రేక్షకుల ముందుకు రానుంది.