Prashanth Varma Cinematic Univese : టాలీవుడ్ మూవీ లవర్స్ తో పాటు హనుమాన్ భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్' మూవీ నుంచి ఫస్ట్ లుక్ రానే వచ్చింది. ఇన్నాళ్లూ అభిమానులను ఊరిస్తూ వచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎట్టకేలకు దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తానని చెప్పినట్టుగానే చేశారు. మరి ఈ ఫస్ట్ లుక్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి. 


సూపర్ హీరో కథకు ఇతిహాసాన్ని ముడిపెట్టి ప్రశాంత్ వర్మ రూపొందించిన పాన్ ఇండియా మూవీ 'హనుమాన్' ఏ రేంజ్ లో థియేటర్లను షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. ఏడాది సంక్రాంతికి రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా 250 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. ఊహించని విధంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు పాన్ ఇండియా డైరెక్టర్ గా, హీరో తేజా సజ్జాకు పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చిపెట్టింది.


ఈ నేపథ్యంలోనే 'హనుమాన్' మూవీ క్లైమాక్స్ లో 'శ్రీ రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి?' అనే ప్రశ్నకు సమాధానంగా 'జై హనుమాన్' సినిమాను తెరకెక్కించబోతున్నామని అనౌన్స్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని మేకర్స్ పంచుకున్నారు. అక్టోబర్ 30న 'జై హనుమాన్' ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నట్టుగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అనౌన్స్ చేసింది. 


'ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్'లో భాగంగా రూపొందుతున్న 'జై హనుమాన్' సినిమాలో హనుమంతుడు పాత్రను ఎవరు పోషిస్తారు ? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆ ఉత్కంఠతకు తెర దించారు మేకర్స్. అందరూ అనుకున్నట్టుగానే హనుమాన్ పాత్రను జాతీయ అవార్డు గ్రహీత, 'కాంతార' హీరో రిషబ్ శెట్టి పోషిస్తున్నారు అంటూ 'జై హనుమాన్' ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.


"దీపావళి స్ఫూర్తితో, దివ్య మార్గదర్శి వెలుగులో జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడు రిషబ్ శెట్టితో కలిసి పని చేయడం గౌరవనీయమైనది, ప్రతిష్టాత్మకమైనది.  ఈ దీపావళిని 'జై హనుమాన్' అనే పవిత్ర శ్లోకంతో ప్రారంభిద్దాం, ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిద్దాం" అంటూ ప్రశాంత వర్మ 'జై హనుమాన్' ఫస్ట్ లుక్ రివీల్ చేసి, ఇప్పటిదాకా రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపించబోతున్నాడు అంటూ వచ్చిన రూమర్లను నిజం చేశారు. 






కాగా 'హనుమాన్' సినిమాకు మించి 'జై హనుమాన్' ఉంటుందని ప్రశాంత్ వర్మ సీక్వెల్ పై భారీ హైప్ పెంచారు. తేజ సజ్జా సీక్వెల్ లో కూడా హనుమంతు పాత్రలో కంటిన్యూ అవుతాడని వెల్లడించారు. సెకండ్ పార్ట్ లో మెయిన్ హీరో ఆంజనేయస్వామి అంటూ ఆయన పాత్రను స్టార్ హీరో చేయబోతున్నారని చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా అధీరా, సింబా, మహాకాళి అనే సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇంకోవైపు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ పరిచయం కాబోతున్నారు.



Also Readచిరంజీవి లివింగ్ లెజెండ్... మెగాస్టార్ స్పీచ్ తర్వాత నాగార్జున ట్వీట్ వైరల్... ఏమన్నారో చూశారా?